గొడ్డ‌లి పార్టీ నెవర్ అగైన్: చంద్ర‌బాబు

admin
Published by Admin — June 28, 2026 in Andhra
News Image

రాష్ట్రంలో గొడ్డ‌లి పార్టీ అని ఒక‌టుంది. అది ఎందుకు వ‌చ్చిందంటే.. ప్ర‌జ‌ల‌ను పీడించ‌డానికి, రాష్ట్రాన్ని దోచుకునేందుకు పెట్టా రు. అలాంటి పార్టీలో ఉన్న మంచి నాయ‌కులు, ఆ పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చేవారు. ఒక‌సారి ఆత్మ విమ‌ర్శ చేసుకోవాలి. ఆలోచించు కోవాలి. రాష్ట్రాన్ని నాశ‌నం చేస్తామంటే.. ప్ర‌జ‌ల జీవితాల‌తో ఆడుకుంటామంటే స‌హించాలా?  ఆమాయ‌క యువ‌త ర‌ప్పా ర‌ప్పా అంటే.. ఎవ‌రికి న‌ష్టం?  అనేది త‌ల్లిదండ్రులు ఒక‌సారి ఆలోచన చేసుకోవాలి. పోలీసులు కేసులు పెట్టేదాకా తెచ్చుకోవ‌ద్దు`` అని సీఎం చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు.. వెలిగొండ ప్రాజెక్టులో నిర్వాసితులైన వారిని 300 కోట్ల రూపాయ‌ల మేర‌కు ప‌రిహారం అందించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అమ‌ల‌య్యే సంజీవ‌ని ప్రాజెక్టును కూడా ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా రైతుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాజ‌కీయంగా ప్ర‌జ‌లు మ‌రింత చైత‌న్యం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. గొడ్డ‌లి పార్టీ వ్యూహాల‌ను ప్ర‌తి క్ష‌ణం గ‌మ‌నించాల‌ని సూచించారు. ఆ పార్టీకి మ‌ద్ద‌తు ప‌లికితే.. అది జీవితాల‌ను క‌బ‌ళిస్తుంద న్నారు. ఇలాంటి ప‌రిస్థితి ఎవ‌రికీ రాకూడ‌ద‌ని చెప్పారు.

నేనే పెద్ద జన్‌-జీ!

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దేశంలోను, రాష్ట్రంలోను ప్ర‌స్తుతం జ‌న్‌-జీ గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంద‌ని తెలిపారు. అయితే.. తానే అన్ని త‌రాల్లోనూ జ‌న్-జీ అని పేర్కొన్నారు. త‌న‌క‌న్నా వినూత్నంగా ఆలోచించే వారు లేర‌ని చెప్పారు. అనేక సంచ‌ల‌న కార్య‌క్ర‌మాల‌ను రూపొందించామ‌ని, అవి నేడు దేశ‌వ్యాప్తంగా కూడా అమ‌ల‌వుతున్నాయ‌ని చెప్పారు. అయితే.. త‌న‌కంటే ఎక్కువ‌గా ఆలోచించి.. వినూత్న కార్య‌క్ర‌మాల‌తో ముందుకు వ‌చ్చే వారికి ప్రోత్సాహం అందిస్తామ ని చంద్ర‌బాబు తెలిపారు. ర‌త‌న్ టాటా ఇన్నోవేష‌న్ హ‌బ్‌లు అందుకే ఏర్పాటు చేశామ‌ని చెప్పారు.

అమ‌రావ‌తిపై కుట్ర‌లు..

వైసీపీ అధికారం కోల్పోయినా.. ప్ర‌జ‌లు 11 సీట్ల‌కే ప‌రిమితం చేసినా.. ఆ పార్టీ కుట్ర‌లు మాత్రం ఆగ‌డం లేద‌న్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తిపై ఆది నుంచి విషం క‌క్కుతూనే ఉంద‌న్నారు. ``అక్క‌డికి వెళ్లి రైతుల‌ను ప‌రామ‌ర్శిస్తార‌ట‌. మీరు అమ‌రావ‌తిని నాశ‌నం చేసి.. వంద‌ల మంది రైతుల‌పై కేసులు పెట్టి, లాఠీల‌తో కొట్టించిన‌ప్పుడు ఎవ‌రైనా వ‌చ్చి ప‌రామ‌ర్శించారా?  రాజ‌ధాని అభివృద్ధిని ఓర్వ‌లేక‌.. ప‌నులు పూర్త‌యితే ఎక్క‌డ మీకు అడ్ర‌స్ లేకుండా పోతుందోన‌న్న బెంగ‌తో ఇప్పుడు నాట‌కాలు, కుట్ర‌ల‌కు తెర‌దీశారు. దీనిని ఉపేక్షించం. గొడ్డ‌లి పార్టీకి త‌గిన విధంగా బుద్ధి చెబుతాం అని చంద్ర‌బాబు హెచ్చరించారు.

Tags
goddali party cm chandrababu ycp
Recent Comments
Leave a Comment

Related News