రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కాయి. వైసీపీ వర్సెస్ టీడీపీ(TDP) మధ్య మరింత పొలిటికల్ సెగ రాజుకుంది. ఒక వైపు డీఎస్సీ అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న జగన్‌కు.. ప్రభుత్వం బలమైన కౌంటర్లు ఇస్తున్నా.. ఆశిం చిన స్థాయిలో లేదన్న చర్చ సాగుతోంది. ఇక, రెండేళ్ల పాలనపై ప్రభుత్వం విజయోత్సవ సభను ఏర్పా టు చేసింది. దీనికి కౌంటర్‌గా వైసీపీ వెన్నుపోటు అంశాన్ని తెరమీదకి తెచ్చింది. ప్రజలకు వెన్ను పోటు పొడిచారన్నది వైసీపీ చెబుతున్న మాట.
వాస్తవం ఏంటి.. ?
1) రాష్ట్రంలో కూటమి సర్కారు వచ్చే సరికి.. ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పిన లెక్కల ప్రకారం.. 7 లక్షల కోట్లరూపాయల వరకు అప్పులు వున్నాయి. బయట రాజకీయంగా చేస్తున్న విమర్శల ప్రకారం.. 10 లక్షల కోట్ల పైచిలుకు అప్పులు ఉన్నాయి. అయినప్పటికీ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం.. సూపర్ సిక్స్‌లను అమలు చేస్తున్నారు. ఇది వాస్తవం కాదా!. దీనిని వైసీపీ(YCP) మసి పూసి మారేడుచేయాలని అనుకుంటోంది వాస్తవం కాదా!.
2) ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వం మోసం చేసిందని జగన్(Jagan) ఆరోపిస్తున్నారు. వాస్తవం.. ఏంటి? క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గంలో ప్రైవేటు భాగస్వామ్యంతో ఉద్యోగ మేళాలు నిర్వహించారు. 164 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు నియోజకవర్గానికి 20 వేల మంది చొప్పున ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించారు. మరోవైపు 15 వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులు బర్తీచేశారు. 3 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చారు. వీటిని వైసీపీ విస్మరించడం భావ్యమా?!.
3) విజయోత్సవం అర్హత లేదా.. ?
రెండేళ్ల పాలనలో 1వ తేదీనే పింఛను ఇస్తున్నారు. వలంటీర్లు లేకున్నా.. నిరంతరా యంగా ఇది కొనసా గుతోంది. అంతేకాదు.. రెండేళ్లలో ఒక విడత తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా.. అర్హులైన తల్లులకు 15 వే లచొప్పున నిధులు ఇచ్చారు. ఆర్టీసీ (RTC) బస్సులో ఉచిత ప్రయాణాలకు అవకాశం ఇచ్చారు. రైతులకు అన్నదాత సుఖీభవ ఇచ్చారు. అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. పెట్టుబడుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు. ఇవన్నీ.. రెండేళ్ల విజయాలు కాదా? విజయోత్సవం చేసుకునే అర్హత లేదా? అనేది వైసీపీ ఆలోచన చేయాల్సి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.