వైసీపీ అధినేత జగన్‌ను జనసేన పార్టీఅధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓవర్ టేక్ చేశారా? కేంద్రంలో ఇకపై.. ప్రధానికి అత్యంత సన్నిహిత యువ నాయకుడిగా పవన్ ఓవెలుగు వెలగనున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. గత నెలలో ప్రధాని హైదరాబాద్‌కు వచ్చినప్పుడు.. నేరుగా పవన్‌ను కలుసుకున్నారు. ఆయన ఆరోగ్య విషయంలో కొన్ని సూచనలు చేశారు. తాజాగా ఎన్డీయే నేతల సమావేశంలోనూ పవన్ ను ప్రత్యేకంగా గౌరవించారు.
ఈ పరిణామాలను గమనిస్తున్నవారు.. జగన్ ప్లేస్ రీప్టేస్‌కావడంఖాయమని అంటున్నారు. మరికొందరు ఇప్పటికే ప్రధాని ఆయనను పక్కన పెట్టారని చెబుతున్నారు. గతంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. జగన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రధాని మోడీకి .. జగన్ దత్తపుత్రుడని వ్యాఖ్యానించిన విషయం గుర్తుండే ఉంటుంది. దీనిపై ప్రధాని, జగన్‌లు కూడా మౌనంగా ఉన్నారు. అంటే.. ఆమేరకు ఇరువురిమధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
అయితే.. ఇటీవల కాలంలో ముఖ్యంగా గత రెండేళ్లలో ప్రధాని మోడీ జగన్‌ను పన్నెత్తి పలకరించింది లేదు. కనీసం.. ఏపీలో పర్యటించినప్పుడు కూడా.. జగన్ గురించి ఆరా తీసింది లేదు. అయినా.. ఇరువురి మధ్య అనుబంధం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది. కేంద్రానికి అన్ని విధాలా మద్దతు ఇస్తున్నామని వైసీపీ నాయకులు కూడా చెబుతున్నారు. ఈ సునిశిత బంధం నిజమో.. కాదో.. అనేది పక్కన పెడితే..జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. జనసేన జగన్ ప్లేస్‌ను రీప్లేస్ చేయడం ఖాయమని అంటున్నారు.
ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్.. పదే పదే .. ప్రధాని మోడీపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇక, తాజాగా ఎన్డీయే సమావేశంలోనూ మోడీని ఆకాశానికి ఎత్తేశారు. ఆయన దార్శినికతను కొనియాడారు. అనంతరం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా.. వల్లభ్‌భాయ్ పటేల్‌ను.. మోడీని ఒకే విధంగా కొనియాడా రు. దీంతో మోడీకి అత్యంత ఆప్తుల జాబితాలోనే కాదు.. ముఖ్య ఆప్తుడిగా కూడా పవన్ పెరుగుతున్నారన్న ది జాతీయ మీడియాలో జరుగుతున్న చర్చ. ఇది వచ్చే ఎన్నికల నాటికి మరింత బలోపేతం అవుతుంద నిచెబుతున్నారు. ఇదే జరిగితే.. జగన్‌ను పవన్ ఓవర్ టేక్ చేసి.. ప్రధాని దగ్గర మంచి మార్కులు వేయించుకోవడం ఖాయమని అంటున్నారు.