మూసీ నది ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని.. దీనికి సంబంధించిన అనుమతులు.. నిధుల కోసం ఢిల్లీ పెద్దలతో మాట్లా డేందుకు ప్రయత్నిస్తున్నానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే.. ఎన్నిసార్లు ఢిల్లీ చుట్టూ తిరిగాన వారు పట్టిం చుకోవడం లేదన్నారు. మూసీ నది ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. గంగా, యమునా.. వంటి నదుల రివర్ ఫ్రంట్ల ను కేంద్రం కట్టుకుంటోందని.. కానీ, మూసీ ప్రక్షాళనకు వచ్చే సరికి మాత్రం అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. తాజా గా ఉప్పల్ లో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
కేంద్రంలో మంత్రిగా ఉన్న పెద్దనాయకుడు కూడా తెలంగాణ సమస్యలపై స్పందించడం లేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. మూసీ ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉందని పదే పదే చెప్పిన పట్టించుకోవడం లేదన్నారు. ఫ్లోరైడ్, కాలుష్యంతో ఇక్కడి ప్రజలు అల్లాడుతున్నా.. కేంద్ర మంత్రికి కనిపించడం లేదా? అని బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని సీఎం నిలదీశారు. ముఖ్యంగా నల్లగొండ బిడ్డలు.. ఫ్లోరైడ్ నీటితో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని.. వారిని కాపాడుకునే బాధ్యత తమ ప్రభు త్వం తీసుకుంటుందని వివరించారు. ఎన్ని కష్టాలు పడైనా మూసీ నది ప్రక్షాళన చేస్తామన్నారు.
ఉప్పల్‌లొని టీకేఆర్ జంక్షన్‌లో 400 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆరు లైన్ల ఫ్లై వోవర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శంకు స్థాపన చేశారు. అలానే 38 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఆసుపత్రి భవనానికి కూడా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ.. మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో ప్రజలు ఆశించిన మేరకు అభివృద్ధి కార్యక్రమాలుచేపట్టలేక పోయానని చెప్పారు. అయితే.. అప్పుడు ఎంపీగా చేయలేని పనులు, ఇప్పుడు సీఎంగా ఉండి.. వడ్డీతో సహా పూర్తి చేస్తానని రేవంత్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ఏమాత్రం సహకరించలేదని బీఆర్ ఎస్‌పై విమర్శలు గుప్పించారు.
ప్రస్తుతం మూసీ ప్రక్షాళనను ఒక ఉద్యమం మాదిరిగా ముందుకు తీసుకువెళ్తున్నట్టు చెప్పారు. దీనికి ఎవరు అడ్డుపడినా తొక్కుకుంటూ ముందుకు పోతామన్నారు. తెలంగాణ బిడ్డలు గుక్కెడు నీటికి కూడా ఇబ్బంది పడుతున్నారని.. ఈ బాధ చూడలేకే తాను మూసీ ప్రక్షాళన అనే మహా క్రతువును భుజాన వేసుకున్నానని చెప్పారు. అలానే.. హైదరాబాద్‌లో మెట్రో విస్తరణ పనులు కూడా చేపట్టాల్సి ఉందన్నారు. దీనికి సంబంధించిన పనుల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నా.. పట్టించుకో వడం లేదన్నారు. మూసీ ముప్పు వల్లే ఉప్పల్ విలువ పడిపోయిందని వ్యాఖ్యానించారు.