తెలుగు త‌మ్ముళ్ల చేతివాటంతో పార్టీకి తలనొప్పి!

admin
Published by Admin — June 08, 2026 in Politics
News Image
ఓవ‌ర్ హెడ్ ట్యాంక్ ఎంత క్లీన్‌గా ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో నీళ్లు ఇచ్చే పంపులు కూడా క్లీన్‌గాఉండాలి. అవి తుప్పు ప‌డితే.. ఓవ‌ర్‌హెడ్ ట్యాంక్ ఎంత నీట్‌గా ఉన్నా.. ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఈ విష‌యంపార్టీల‌కు కూడా వ‌ర్తిస్తుంది. ముఖ్యంగా గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో ఇదే పెద్ద స‌మ‌స్యగా మారింది. క్షేత్ర‌స్థాయిలో ఎమ్మె ల్యేలు, నాయ‌కులు.. వ్య‌వ‌హ‌రించిన తీరును వైసీపీ అధినేత‌, అప్ప‌టి సీఎం జ‌గ‌న్ చాలా లైట్ తీసుకున్నా రు. ఇది పార్టీ ఓట‌మికి దారితీసింది.
 
పైకి ఎంత మంచి పాల‌న అందించామ‌ని అప్ప‌ట్లో జ‌గ‌న్ చెప్పుకొన్నా.. క్షేత్ర‌స్థాయిలో జ‌రిగిన అవినీతి, అక్ర‌మాల‌ను నిలువ‌రించ‌లేని కార‌ణంగా వైసీపీఘోరంగా ఓడిపోయింది. ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త‌ను కూడా పెంచింది. జ‌గ‌న్ మంచి నేతే.. అని చెప్పిన వారు కూడా.. ఎమ్మెల్యేల‌పై వ్య‌తిరేక‌త చూపించారు. ఇది.. పార్టీలో అనేక మార్పుల‌కుదారితీసింది. మీ గ్రాఫ్ బాగోలేదు.. అని చెప్ప‌డానికి కూడా కార‌ణ‌మైంది. అయినా.. అప్ప‌టికే వ‌చ్చిన వ్య‌తిరేక‌త వైసీపీని నిండా ముంచేసింది.
 
ఇక‌, ఇప్పుడు రెండు సంవ‌త్స‌రాల కాలంలోనే కూట‌మి ప్ర‌భుత్వంలో ముఖ్యంగా టీడీపీ నాయ‌కులు కొం దరు చేస్తున్న ప‌నులు ప్ర‌భుత్వానికి, పార్టీకి కూడా ఇబ్బందిగా మారింది. క్షేత్ర‌స్థాయిలో ఏ చిన్న‌ప‌ని కావాల‌న్నా.. ఎమ్మెల్యే కార్యాల‌యం నుంచి ప‌త్రాలు తెచ్చుకోవాల‌ని అధికారులు చెబుతున్నారు. పోనీ.. ఎమ్మెల్యే కార్యాల‌యాల‌కు వెళ్లినా.. అక్క‌డ ఏదీ ఉచితంగా రావ‌డం లేదు. దీంతో చేతులు త‌డ‌పాల్సి వ‌స్తోంది. ఇది బ‌హిరంగం ర‌హ‌స్యంగా కూడా మారిపోయింది.
 
అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వం నుంచి మాత్రం ఉలుకు ప‌లుకు లేకుండా పోయింది. ఇది ప్ర‌జా వ్య‌తిరేక‌త‌కు పెద్ద ముప్పుగామారుతుంద‌న్న సంకేతాలు వ‌స్తున్నాయి. క్షేత్ర‌స్థాయిలో రూపాయి అవినీతి జ‌రిగినా.. ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాన్నే త‌ప్పుబ‌డ‌తారు. అలాంటి పార్టీ నాయ‌కులే ప‌త్రాల పేరుతో చేతివాటం ప్ర‌ద‌ర్శిస్తే.. ఇంక ఎవ‌రికి చెప్పాలి? అనే ప్ర‌శ్న తెర‌మీదికి వ‌స్తోంది. చంద్ర‌బాబు ఇప్ప‌టికైనా అలెర్ట్ కాక‌పోతే.. త‌మ్ముళ్ల చేతివాటాన్ని అరిక‌ట్ట‌క‌పోతే.. ఖ‌చ్చితంగా స‌ర్కారుకు ఇది పెను శాపంగా మారే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు హెచ్చ‌రిస్తున్నారు.
Tags
cm chandrababu tdp problems
Recent Comments
Leave a Comment

Related News