నోళ్లు మూసుకోండి.. నాగ‌బాబు వార్నింగ్‌కు ప్ర‌కాశ్‌రాజ్ షాకింగ్ కౌంట‌ర్‌!

admin
Published by Admin — June 06, 2026 in Politics, Andhra
News Image

మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు(Naga Babu), విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య సోషల్ మీడియా వేదికగా మరోసారి ట్విట్టర్ వార్ పీక్స్‌కు చేరింది. ఒకప్పుడు ‘మా’ (MAA) ఎన్నికల్లో ప్రకాష్ రాజ్‌కు వెన్నుదన్నుగా నిలిచిన మెగా ఫ్యామిలీ, ఇప్పుడు ఆయనతోనే సైద్ధాంతిక పోరాటానికి దిగడం టాలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా నాయకత్వం అనే అంశంపై నాగబాబు చేసిన ఒక పోస్ట్, దానికి ప్రకాష్ రాజ్ ఇచ్చిన రిటన్ గిఫ్ట్ నెట్టింట మంటలు రేపుతోంది.

ఇటీవల కాలంలో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)ను టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగబాబు తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పవన్ కళ్యాణ్ ఫోటోను షేర్ చేస్తూ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేసింది. “నాయకుడి మాటే శాసనం. ఆ లీడర్ ప్రయాణించే మార్గంలో ఎలాంటి రాక్షసులు, దెయ్యాలు ఎదురవుతాయో ఎవరికీ తెలియదు, కేవలం ఆ నాయకుడికి మాత్రమే తెలుస్తుంది. ఏది తప్పు, ఏది ఒప్పో కూడా లీడరే నిర్ణయిస్తాడు. కాబట్టి మీకున్న అనుమానాలన్నీ పక్కన పెట్టేసి.. నోళ్లు మూసుకుని, ఎలాంటి ప్రశ్నలు వేయకుండా మీ లీడర్‌ను బ్లైండ్‌గా ఫాలో అవ్వండి” అంటూ నాగబాబు గట్టిగా రాసుకొచ్చారు.

నాగబాబు చేసిన ఈ నోళ్లు మూసుకోండి వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్(Prakash Raj) అంతే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాగబాబు ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. తనదైన శైలిలో చురకలు అంటించారు. `అసలు నోళ్లు మూసుకోండి.. ప్రశ్నలు అడగకుండా లీడర్‌ను అనుసరించండి అనడంలో మీ ఉద్దేశం ఏంటి నాగబాబు గారు? మేమేమన్నా బానిస బ్రతుకులు బ్రతకడానికి గొర్రెలమా? ఇలాంటి బెదిరింపులు మా దగ్గర సాగవు. ప్రశ్నించడం అనేది పౌరుడిగా మా ప్రాథమిక హక్కు. తానే పెద్ద లీడర్‌ని అని అహంకారంతో అనుకునే ఏ నాయకుడైనా సరే.. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కచ్చితంగా ఉంటుంది.. అర్థం అయిందా?` అంటూ ప్రకాష్ రాజ్ సూటిగా కౌంట‌ర్ ఇచ్చారు. దీంతో ప్రకాశ్‌రాజ్ ట్వీట్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

Tags
Naga Babu Prakash Raj Pawan Kalyan Mega Family JanaSena
Recent Comments
Leave a Comment

Related News