టీడీపీలో కోటంరెడ్డి హాట్ టాపిక్.. ఆ ఒక్క మాట‌తో టాప్ ట్రెండింగ్!

admin
Published by Admin — May 30, 2026 in Politics, Andhra
News Image

తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)లో ఇప్పుడు ఎక్కడ చూసినా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరే వినిపిస్తోంది. ఇటీవల ముగిసిన మహానాడు వేదికగా ఆయన చేసిన ప్రసంగం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సాధారణంగా మహానాడు వంటి పెద్ద వేదికలపై నాయకులు అధినేతను ప్రసన్నం చేసుకోవడానికో, లేదా ప్రత్యర్థి పార్టీలను విమర్శించడానికో ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ, కోటంరెడ్డి మాత్రం రూట్ మార్చారు. పార్టీకి అసలైన పిల్లర్లు అయిన కార్యకర్తల గుండె గొంతుకగా మారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఒక్క మాటతోనే ఆయన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కేడర్‌కు మోస్ట్ ఫేవరెట్ లీడర్‌గా మారిపోయారు.

ఎన్నికలకు కేవలం ఏడాదిన్నర ముందే టీడీపీ సైకిల్ ఎక్కిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy).. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం రక్తం చిందించిన పాత కార్యకర్తల బాధను సరిగ్గా క్యాచ్ చేశారు. "ఎమ్మెల్యేలు, ఎంపీలమైన మేము అవసరాలు, పరిస్థితులను బట్టి పార్టీలు మారిపోతుంటాం.. కానీ జెండాను నమ్ముకున్న కార్యకర్త మాత్రం ఎప్పుడూ జెండా కిందే ఉంటాడు" అంటూ ఆయన చెప్పిన పచ్చి నిజం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. ముఖ్యంగా గత ఐదేళ్ల కష్టకాలంలో అరెస్టులకు, కేసులకు భయపడకుండా పార్టీని మోసిన పాత తరం నాయకులకు, యువ కార్యకర్తలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం టికెట్లు ఇవ్వాలని కోటంరెడ్డి డిమాండ్ చేశారు. అధిష్టానానికి ఆయన ఇచ్చిన ఈ పొలిటికల్ సలహా కార్యకర్తల మనసులను గెలుచుకుంది.

కోటంరెడ్డి కేవలం వేదికపై స్పీచ్‌ ఇచ్చి వదిలేయలేదు. తన నియోజకవర్గమైన నెల్లూరు రూరల్‌లో రాబోయే స్థానిక ఎన్నికల్లో వంద శాతం టికెట్లను ‘ఓల్డ్ టీడీపీ’ కేడర్‌కే ఇస్తానంటూ బహిరంగంగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. పార్టీలో కొత్తగా చేరిన తన అనుచరుల కంటే, కష్టకాలంలో పసుపు జెండాను మోసిన వారికే తన మొదటి ప్రాధాన్యత అని చెప్పడం ఆయన రాజకీయ పరిణతికి అద్దం పడుతోంది. ఈ ధైర్యమే ఇప్పుడు టీడీపీ(TDP) శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

మహానాడు(Mahanadu) ముగిసి రోజులు గడుస్తున్నా.. సోషల్ మీడియాలో కోటంరెడ్డి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఫేస్‌బుక్, ఎక్స్ వేదికలపై ఆయన వీడియోలు లక్షలాది వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. విశేషం ఏంటంటే.. కోటంరెడ్డి ప్రసంగంలోని ఆ నిర్దిష్టమైన క్లిప్‌ను టీడీపీ తమ్ముళ్లు తమ వాట్సాప్ స్టేటస్‌లుగా కూడా పెట్టుకుంటున్నారు. మొత్తానికి 2024 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన కోటంరెడ్డి.. ఇప్పుడు పార్టీ అంతర్గత రాజకీయాల్లోనూ, కేడర్ గుండెల్లోనూ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు

Tags
Kotamreddy Sridhar Reddy Mahanadu AP News Ap Politics Andhra Pradesh TDP CM Chandrababu
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News