తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక అయిన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, తెలుగు తేజం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా కాలిఫోర్నియా(California)లోని గోదావరి రుచులు బ్యాంకెట్ హాల్‌లో మహానాడు కార్యక్రమాన్ని అత్యంత అట్టహాసంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో ఎన్ఆర్ఐ తెలుగు ప్రజలు, టీడీపీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సభా ప్రాంగణం పసుపు జెండాలతో కళకళలాడుతూ పండుగ వాతావరణాన్ని తలపించింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరై ఎన్టీఆర్ ఆశయాలు, చంద్రబాబు నాయకత్వం, తెలుగు జాతి గౌరవం గురించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. అదేవిధంగా ఏపీ(AP) జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, చిన్న, సూక్ష్మ, మధ్యతరహా శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గౌతు శిరీష, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్, ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జైరాం, ఏపీ ప్రభుత్వ సలహాదారు మరియు ఏపీఎన్‌ఆర్టీ అధ్యక్షులు డాక్టర్ రవి వేమూరు తదితరులు పాల్గొని తెలుగు ప్రజల ఐక్యత, అభివృద్ధి, ఎన్టీఆర్ వారసత్వం, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు దిశపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

అలాగే, యువనేత నారా లోకేష్ నాయకత్వ సామర్థ్యం, పార్టీని తదుపరి స్థాయికి తీసుకెళ్లగల దూరదృష్టి, యువతలో ఆయనకు ఉన్న విశేష ఆదరణ, కొత్త తరం ఆలోచనలతో ముందుకు సాగే Gen-Z నాయకత్వ లక్షణాలపై పలువురు ప్రత్యేకంగా ప్రస్తావించారు. పార్టీ భవిష్యత్తును బలోపేతం చేసే శక్తి, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో నైపుణ్యం, యువతను ఆకర్షించే నాయకత్వ గుణాలు నారా లోకేష్(Nara Lokesh)ను యువత ఐకాన్‌గా నిలబెడుతున్నాయని కొనియాడారు.
.jpeg)
అమెరికా బే ఏరియా నుంచి యూఎస్ కాంగ్రెస్‌కు పోటీ చేస్తున్న రాఖీ ఇస్రాని కూడా ఈ మహానాడు కార్యక్రమానికి హాజరై స్వర్గీయ ఎన్టీఆర్(NTR) గారి విశిష్ట నాయకత్వం, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. చివరగా ఎమ్మెల్యే బండారు శ్రావణి స్ఫూర్తిదాయకంగా ప్రసంగించి సభకు హాజరైన వారందరినీ ఆకట్టుకున్నారు. ఈ మహానాడు కార్యక్రమాన్ని శ్రీకాంత్ దొడ్డపనేని సమన్వయం చేసి అత్యంత విజయవంతంగా నిర్వహించగా, కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ ఆయన నిర్వహణను అభినందించారు.. వెంకట్ అడుసుమల్లి, మురళి గొడవర్తి, భక్త బల్లా, సురేష్ పోతినేని, వెంకట్ కొల్లా, సుధీర్ వున్నం, సుబ్బ యంత్ర, చంద్ర గుంటుపల్లి, సందీప్ ఇంటూరి, రాజశేఖర్, ఎంవీ రావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
.jpeg)