ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ముఖ్యంగా హాట్ సీట్‌గా మారిన నెల్లూరు జిల్లాలో సరికొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్లు వంద శాతం అమలు కావడం ఖాయమనే సంకేతాలు వస్తున్న తరుణంలో, జిల్లా రాజకీయాల్లో మరో లేడీ లీడర్ దూసుకొస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy) కుమార్తె కోటంరెడ్డి సాయి వైష్ణవి రెడ్డి ఒక్కసారిగా పొలిటికల్ స్క్రీన్‌పైకి రావడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె తాజాగా పెట్టిన ప్రెస్మీట్ కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి కౌంటర్ ఇచ్చేలా సాగడం గమనార్హం.
పైగా తన తొలి అధికారిక ప్రెస్మీట్‌లోనే సాయి వైష్ణవి రెడ్డి నేరుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy)ని టార్గెట్ చేశారు. గతంలో తమ కుటుంబం పార్టీ కోసం ఎంతగా శ్రమించిందో గుర్తు చేస్తూనే, వైఎస్ జగన్ వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన నాయకులకు కనీసం అపాయింట్‌మెంట్లు కూడా ఇవ్వకుండా అవమానించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
"ప్రజాస్వామ్యంలో నాయకుడనే వాడు ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండాలి. తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితమై రాజకీయం చేస్తానంటే కుదరదు" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత వైసీపీ(YCP) ప్రభుత్వం కేవలం ఫోన్ ట్యాపింగ్‌లు, కక్షసాధింపు చర్యలకే ప్రాధాన్యత ఇచ్చిందని, ఫలితంగా నెల్లూరు జిల్లా అభివృద్ధి పూర్తిగా వెనుకబడిపోయిందని ఆమె ధ్వజమెత్తారు.
ఇకపోతే సాయి వైష్ణవి(Kotamreddy Sai Vaishnavi ) రాజకీయం వైపు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు, అలాగే ఆయన పార్టీ మారే తరుణంలో జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆ క్లిష్ట సమయంలో కోటంరెడ్డి కుమార్తెలు హైందవి, వైష్ణవి ఇద్దరూ క్షేత్రస్థాయిలోకి వెళ్లి కేడర్‌కు కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. తండ్రి వెనుక నడిచే అనుచరులను కాపాడుకుంటూ వచ్చారు. అప్పట్లో తెరవెనుక ఉండి నడిపిన వైష్ణవి, ఇప్పుడు నేరుగా మైక్ పట్టుకుని విపక్షాలపై గర్జించడం కోటంరెడ్డి కుటుంబం తన తదుపరి తరాన్ని అధికారికంగా రంగంలోకి దించిందనే సంకేతాలను ఇస్తోంది.
భవిష్యత్తులో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల పునర్విభజన జరగడం, అలాగే చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కూటమి (TDP-JSP-BJP) తరఫున నెల్లూరు రూరల్ లేదా జిల్లాలోని మరేదైనా కీలక స్థానం నుండి సాయి వైష్ణవిని వచ్చే ఎన్నికల్లో బరిలోకి దించేందుకు కోటంరెడ్డి ఫ్యామిలీ పక్కా స్కెచ్ వేసినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. ఈ వ్యూహాత్మక ప్రెస్మీట్ వెనుక అసలు ఉద్దేశం కూడా వైష్ణవిని జిల్లా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి కోటంరెడ్డి వారసురాలి ఎంట్రీతో నెల్లూరు పాలిటిక్స్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారబోతున్నాయి.