దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, అస్సాం(ఈశాన్య రాష్ట్రం)లో బీజేపీ విజయం దక్కించుకునే దిశగా దూసుకుపోతోంది. బెంగాల్ లో కడపటి వార్తలు అందే సరికి.. 294 స్థానాల్లో బీజేపీ 182స్థానాలు దక్కించుకుంది. తద్వారా మేజిక్ ఫిగర్.. 148 స్థానాలను ఆ పార్టీ దాటేసింది. ఇక, అస్సాంలోనూ 140 అసెంబ్లీ స్థానాలకు గాను.. బీజేపీ 100కు పైగా సీట్లలో ఆధిపత్యం కొనసాగిస్తోంది.
ఈ పరిణామాలపై ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ విజయం ప్రధాని నరేంద్ర మోడీ(pm modi)పై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని, నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని కొనియాడారు. ఎన్డీయే మరింత బలో పేతం అవుతుందని చెప్పారు. దేశంలో ఎన్డీయేకు తిరుగులేదనడానికి ఇదొక నిదర్శనమని చంద్రబాబు(cm chandrababu) పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు ద్వారా దేశాన్ని అభివృద్ధిలో నడిపిస్తున్నారని ప్రధానిని కొనియా డారు.
ఈ విజయాన్ని సాధించేలా కార్యకర్తలు, నాయకులను ముందుండి నడిపిన ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నితిన్ నబీన్‌కు చంద్రబాబు అభినందనలు తెలిపారు. రాష్ట్రాల వారీగా చూస్తే.. బీజేపీ కూటమి కూడా ముందంజలోనే ఉంటోంది. పుదుచ్చేరిలో కూటమి కట్టి మూ డో సారి వరుసగా ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తోంది. ఇక, తమిళనాడులోనూ పొత్తు పెట్టుకుని అధికారం లోకి వచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.
కేరళలో మాత్రమే బీజేపీకి అనుకూల పవనాలు వీయలేదని చెప్పాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ విజయం దిశగా దూసు కుపోయింది. కాగా.. చంద్రబాబు అభినందనలకు.. కేంద్రం స్పందించింది. కృతజ్ఞతలు తెలిపింది. దేశంలో ప్రజలు డబుల్ ఇంజన్ సర్కారును కోరుకుంటున్నారని వ్యాఖ్యానించింది.