టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమార్తె జనని, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్యతేజల నిశ్చితార్థ వేడుక ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ దిగ్గజాల సమక్షంలో జరిగిన ఈ వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వేడుకలో ప్రధాన ఘట్టం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) దంపతుల సమక్షంలో జరిగింది. వారి ఆశీస్సుల మధ్య జనని-సూర్యతేజలు ఒకరికొకరు ఉంగరాలు మార్చుకుని కొత్త జీవితానికి పునాది వేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు దంపతులు కాబోయే వధూవరులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

బండ్ల గణేష్‌తో ఉన్న సాన్నిహిత్యంతో ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి ప్రముఖులు క్యూ కట్టారు. మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతులు విచ్చేసి నూతన జంటను ఆశీర్వదించారు. వీరితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు( Venkaiah Naidu)
, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, స్టార్ కమెడియన్ బ్రహ్మానందం, హీరో శ్రీకాంత్ వంటి ప్రముఖులు హాజరై సందడి చేశారు.
రాజకీయ వర్గాల నుండి తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైసీపీ(YCP) ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. సినిమా రంగం నుండి దర్శకుడు శ్రీను వైట్ల, నటుడు శివాజీ, రచయిత కోన వెంకట్, నిర్మాత సి. కల్యాణ్ వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. తన గారాల పట్టి జనని నిశ్చితార్థాన్ని బండ్ల గణేష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ప్రముఖుల రాకతో ఈ వేడుక టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక త్వరలోనే ఈ జంట వివాహ వేడుక మరిన్ని విశేషాలతో, అంగరంగ వైభవంగా జరగనుంది.