జగన్ అప్ చేస్తే..చంద్రబాబు డౌన్ చేశారు

admin
Published by Admin — May 01, 2026 in Politics
News Image

వైసీపీ(ycp) హయాంలో ఏపీ ప్రజలకు కరెంటు బిల్లులు షాకిచ్చిన సంగతి తెలిసిందే. జగన్(jagan) పుణ్యమా అంటూ ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు చార్జీలు అంటూ జనంపై పెను భారం పడింది. ఏపీ సీఎంగా చంద్రబాబు 2024లో పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా ఆ భారం కొనసాగింది. అయితే, తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని 2024 ఎన్నికలకు ముందు కూటమి పార్టీల తరఫున చంద్రబాబు(chandrababu) హామీనిచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు మరోసారి అదే విషయాన్ని స్పష్టం చేశారు.

ఎన్నికలయ్యే వరకు ఏపీలో విద్యుల్ చార్జీలు(electricity charges) పెంచబోనని(no hike) చంద్రబాబు మరోసారి హామీనిచ్చారు. విద్యుత్ చార్జీల తగ్గింపుపై దృష్టి సారించామని, 2026 చివరి నాటికి విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.4.60కి తగ్గించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచిందని, వైసీపీ సర్కార్ విధించిన ట్రూ-అప్ ఛార్జీలను ట్రూ డౌన్ చేశామని అన్నారు. వినియోగదారులపై భారం తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామని, భవిష్యత్తులో ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారు. పునరుత్పాదక ఇంధన వనరుల వాటాను పెంచుతామని అన్నారు.

Tags
cm chandrababu Electricity Bills no hike promise fulfilled ycp tdp
Recent Comments
Leave a Comment

Related News