ఆ అవార్డు మీ అందరిదీ: చంద్రబాబు

admin
Published by Admin — May 01, 2026 in Andhra
News Image

ఏపీ సీఎం చంద్రబాబు(ap cm chandrababu)కు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్' (Business Reformer of the Year 2025 ) అవార్డును ది ఎకనామిక్ టైమ్స్ (ET) అందించిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ముంబైలో చంద్రబాబు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
పారిశ్రామికాభివృద్ధి, పరిపాలనలో టెక్నాలజీని ఉపయోగించడం, 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'లో చంద్రబాబు తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలకు గుర్తింపుగా జాతీయ స్థాయి జ్యూరీ ఈ అవార్డు కోసం చంద్రబాబును ఎంపిక చేసింది.

ఈ అవార్డు తనకు రావడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు పెన్షన్ల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అవార్డు తన వ్యక్తిగత విజయం కాదని, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల కఠిన శ్రమ, పారిశ్రామికవేత్తలు రాష్ట్రంపై ఉంచిన నమ్మకానికి దక్కిన గౌరవమని అన్నారు.
ఈ అవార్డు తనకు రాలేదని...ఇది రాష్ట్రానికి...మంత్రులు, అధికార యంత్రాంగానికి వచ్చిందని చెప్పారు.

ఈ అవార్డు అందరికీ అంకితం ఇద్దామనుకుంటున్నానని చెప్పారు. తాను ఒక టీం లీడర్, ముఖ్యమంత్రి అని...టీం బాగా పని చేస్తే తనకు మంచి పేరు వస్తుంది..పెన్షన్ల పంపిణీలో 93 శాతం సంతృప్తి ఉందని అన్నారు.

Tags
ap cm chandrababu Business Reformer of the Year 2025 award dedicated
Recent Comments
Leave a Comment

Related News