ఏపీ ఇంటర్ సెకండియర్ పరీక్షల్లో కీలక మార్పు!

admin
Published by Admin — April 18, 2026 in Andhra
News Image

ఏపీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం(intermediate second year) విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్ సెకండియర్ పాస్ అయిన విద్యార్థులకు ఇంప్రూవ్ మెంట్/బెటర్మెంట్ పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తున్నట్లుగా ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా వెల్లడించారు. 

ఇప్పటివరకు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఇంప్రూవ్ మెంట్(improvement exams) పరీక్ష రాసే అవకాశం ఉంది. అయితే ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్ సెకండియర్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్ మెంట్ కలిపి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఒకేసారి పరీక్ష నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. 

పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఈ నిర్ణయం తీసుకుంది. మే 21వ తేదీ నుంచి జరగబోతున్న ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నుంచి ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నామని రంజిత్ బాషా వెల్లడించారు. 

Tags
Intermediate second year students improvement exams
Recent Comments
Leave a Comment

Related News