వైసీపీ(YCP) రాజకీయాల్లో మూడు రాజధానుల కాన్సెఫ్ట్ ఫెయిల్ అయినా ప్యాలెస్‌ల విషయంలో మాత్రం జగన్ మూడు ప్యాలెస్‌ల ఫార్ములాను పక్కాగా ఫాలో అవుతున్నారు. ఇప్పటి వరకు జగన్ బెంగళూరులోని యలహంక ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ మధ్యే సర్వీస్ చేస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు జగన్ లోటస్ పాండ్‌కు కూడా పూర్వ వైభవం తీసుకురావాలని డిసైడ్ అయినట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి ఓటేసి.. తర్వాత ముఖ్యమంత్రి అయిన వెంటనే మూడు రాజధానుల కాన్సెఫ్ట్ తీసుకువచ్చారు.
జగన్(Jagan) ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయే వరకు కూడా ఏపీకి ఉన్నవి మూడు రాజధానులా.. లేదా ఒక రాజధానా అన్నది ఎవ్వరూ తేల్చుకోలేకపోయారు. ఇప్పుడు మూడు రాజధానులు పక్కన పెట్టేసి మావిగన్‌ను తెరమీదకు తీసుకువచ్చారు. మూడు రాజధానులు, మావిగన్ సంగతి అలా ఉంటే జగన్ మూడు ప్యాలెస్‌లకు న్యాయం చేసే పనిలో బిజీ అయినట్టుగా కనిపిస్తోంది. వారంలో నాలుగు రోజుల పాటు బెంగుళూరు, ఆ తర్వాత తాడేపల్లిలో ఉండే జగన్ ఇప్పుడు వారంలో ఒకటి రెండు రోజులు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ అమరావతి(Amaravati), తాడేపల్లిలో ఉండేందుకు ఎంత మాత్రం ఇష్టపడలేదు. అదే టైంలో ఎక్కువుగా బెంగళూరు ఎలహంక ప్యాలెస్‌ను తన పూర్తి నివాసంగా మార్చేసుకున్నారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో ఉండేందుకు ఎంత మాత్రం ఇష్టపడలేదు. అయితే ఇప్పుడు లోటస్‌పాండ్ వైపు కూడా జగన్ చూస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఉండడం, తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడంతో జగన్ లోటస్‌పాండ్‌లో ఉండేందుకు ఆసక్తి చూపలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు ఏపీ(AP)లో వైసీపీ నేతలను లోటస్‌పాండ్‌కు పిలిపించుకుని అక్కడ రాజకీయ వ్యూహాలు పన్నేలా ప్లానింగ్ జరుగుతోందని సమాచారం. వచ్చే ఎన్నికలకు మరో మూడేళ్ల టైం మాత్రమే ఉంది. ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన హడావిడి మొదలైంది. మరోవైపు ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేయడంతో పాటు జగన్ పాదయాత్ర ప్లానింగ్, నియోజకవర్గాల పెంపు, కొత్త అభ్యర్థులను ప్రోత్సహించడం లాంటి అంశాలపై ఎప్పటికప్పుడు పార్టీ నేతలతో చర్చించేందుకు వీలుగా జగన్ లోటస్‌పాండ్ నుంచి కూడా రాజకీయం చేయాలని చూస్తున్నట్టు భోగట్టా..! ఏపీ నాయకులు బెంగళూరు వెళ్లడం కష్టం అవుతుంది. అందుకే హైదరాబాద్ లోటస్‌పాండ్ నుంచి జగన్ రాజకీయం నడిపించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.