డీలిమిటేషన్(delimitation) వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తమిళనాడు సీఎం స్టాలిన్ అంటున్న సంగతి తెలిసిందే. ఇదే అనుమానం ఏపీ సీఎం చంద్రబాబు(cm chandrababu), తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలకు కూడా వచ్చింది. అయితే, చంద్రబాబు ఆ అనుమానాన్ని కేంద్రంతో మాట్లాడి నివృత్తి చేసుకున్నారు. ఈ క్రమంలోనే అదే విషయంపై లోక్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah) ఫుల్ క్లారిటీనిచ్చారు. దక్షిణాది జనాభా శాతం కంటే ఎక్కువ సీట్లు పెరుగుతాయని పేర్కొన్నారు. విపక్షాలు అవాస్తవాలు చెబుతూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని విమర్శించారు.
ఏపీలో లోకసభ స్థానాలు(lok sabha seats) 25 నుంచి 38కి పెరుగుతాయని ఆయన అన్నారు. తెలంగాణలో 17 నుంచి 26కు లోక్ సభ స్థానాలు పెరగబోతున్నాయని తెలిపారు. కర్ణాటకలో 28 నుంచి 42కు, తమిళనాడులో 39 నుంచి 59కి, కేరళలో 20 నుంచి 30కి సీట్లు పెరుగుతాయని చెప్పారు. అమిత్ షా ప్రకటనతో ఏపీ, తెలంగాణ ప్రజలలో ఉన్న అపోహలు తొలగిపోయినట్లే కనిపిస్తోంది.
2011 జనాభా లెక్కలను బేస్ చేసుకొని నియోజకవర్గాల పునర్విభజనను కేంద్రం చేపట్టబోతోందని, ఆ విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటు(parliament)లో ప్రాధాన్యత తగ్గుతుందని కాంగ్రెస్ తో పాటు టీఎంసీ, డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి రాష్ట్రానికి పార్లమెంటులో సమాన ప్రాధాన్యత, ప్రాతినిధ్యం కల్పించాలన్న సమాఖ్య వాద సూత్రాలకు ఇది విరుద్ధమని ఆ రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. అయితే, వారి వాదనలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చుతోంది.