ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) ఏం జరుగుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది. తరచుగా వైసీపీ అధినేత జగన్ తామే అధికారంలోకి వస్తామని, తమకు తిరుగులేదని చెబుతున్నారు. అంతేకాదు ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో నిజంగానే ప్రజలు మార్పు దిశగా అడుగులు వేసే పరిస్థితి ఉందా? ప్రజలు మార్పును కోరుకుంటున్నారా? అనే అంశాలు చర్చకు దారితీసాయి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మార్పు దిశగా ప్రజలు అడుగులు వేయకపోగా జగన్ ను మరింత అసహ్యించుకుంటున్నారని తాజాగా వెలుగు చూసిన పలు సర్వేలు స్పష్టం చేస్తున్నారు. ఎవరికైనా, ఏ పార్టీకి అయినా గెలుపు ఓటములనేవి సహజం. ఒకసారి ఓడిన పార్టీ మరోసారి గెలవచ్చు. దానికి ప్రజలు సైతం అవకాశం కల్పిస్తారు. కానీ విధానపరంగా చూసుకున్నప్పుడు మార్పు అనేది నాయకుల్లోను పార్టీలోనూ కనిపించాలి.
ఈ మార్పు లేకపోవడం వల్లే వైసీపీ పరిస్థితి దయనీయంగా మారుతోంది. పట్టుమని పదిమంది కూడా వైసీపీ(YCP)కి మద్దతుగా మాట్లాడలేని పరిస్థితి ఇంకా కొనసాగుతుందంటే వైసీపీ విధానపరమైనటువంటి పెరాలసిస్ తో కుంగిపోతోందన్నది సర్వేలో స్పష్టమైంది. మావిగన్ ప్రకటన తర్వాత ఇది మరింతగా వైసీపీకి ఇబ్బందికర పరిణామంగా మారింది. దీనిని జగన్ గ్రహించకపోతే ప్రమాదం తప్పదు అన్నది సీనియర్లు ఇప్పటికే చెప్పుకొచ్చారు.
అయినా ఆయన మారడం లేదు. మరోవైపు ప్రజలు కూడా జగన్ వైపు చూసే పరిస్థితిని తగ్గించుకున్నారు. సో.. ఈ పరిణామాలతో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏపీలో మళ్ళీ కూటమి ప్రభుత్వం రావడం ఖాయమని వాదన ప్రజల వైపు నుంచే వినిపిస్తుండడం విశేషం. ప్రధానంగా చంద్రబాబు(Chandrababu) విజన్.. అమరావతి నిర్మాణం, దీనికి చట్టబద్ధత వంటివి ప్రస్తుతం ప్రజలను ప్రభావితం చేస్తున్నాయి. అదేసమయంలో ఎలానూ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్న భావన ఉంది. ఇవన్నీ.. వైసీపీ గ్రహిస్తే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా.. కూటమి గెలుస్తుందన్న విషయాన్ని అంగీకరించకతప్పదు.