వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్(ex mp nandigam suresh)పై మరో కీలక కేసు(case)నమోదైంది. ఆయనను తమను మో సం చేశారంటూ.. విజయవాడకు చెందిన ఓ పాస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీసుకున్న సొమ్మును తిరిగి ఇవ్వడమని అడిగితే.. బెదిరింపులకు దిగుతున్నారని.. ఆయనతో తమకు ప్రాణ హాని ఉందని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు. దీంతో నందిగం సురేష్‌పై చీటింగ్ సహా.. బెదిరిం పులు.. సోషల్ మీడియా చట్టం కింద విజయవాడ సుర్యారావుపేట పోలీసులు కేసులు నమోదు చేశారు.
విజయవాడలో సీబీసీఎస్‌సీ చర్చి ప్రఖ్యాతమైంది. ఈ చర్చి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వ హిస్తున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి వీటిని రెన్యువల్ చేసుకోవాలి. ఈ క్రమంలో వైసీపీ హయాంలో వీటి రెన్యువల్ కోసం.. ఎంపీగా ఉన్న నందిగం సురేష్‌ను సీబీసీఎస్‌సీ నిర్వాహకులు ఆశ్రయించారు. దీంతో ఆయన పనిచేయిస్తానని చెప్పి.. దీనికిగాను 25 లక్షల రూపాయలను తీసుకున్నారు. అయితే.. అప్పటి నుంచి ఆయన దాట వేస్తున్నారు. వీరు వేరే మార్గంలో రెన్యువల్ చేయించుకున్నారు.
ఎలానూ రెన్యువల్ చేయించలేదు కాబట్టి..సదరు 25 లక్షలను తిరిగి ఇచ్చేయాలని నందిగంను ఆశ్రయిం చారు. కానీ, ఆయన డబ్బులు ఇవ్వకపోగా.. సొమ్ములు తిరిగి ఇవ్వమన్నందుకు బెదిరింపులు దిగుతు న్నారని సీబీసీఎస్‌సీ చర్చి ట్రస్టు సభ్యుడు వాపోయారు. ఈ క్రమంలోనే ఆయన పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టారు. సొమ్ము తిరిగి ఇవ్వకపోగా.. తమను బెదిరిస్తున్నారని.. ప్రాణ భయం ఉందని ఆయన పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో పోలీసులు మాజీ ఎంపీకి నోటీసులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ వ్యవహారంలో మరోసారి ఆయన జైలుకువెళ్లినా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు.