జగన్ ను ఏకి పారేసిన బాబు

admin
Published by Admin — March 12, 2026 in Politics
News Image
జ‌గ‌న్(jagan) ప్ర‌భుత్వంపై ఏపీ సీఎం చంద్ర‌బాబు(ap cm chandrababu) తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌త ప్ర‌భుత్వం క‌ల్తీ, కుంభ‌కోణాలు, అక్ర‌మాలు, దోపిడీ ప్ర‌భుత్వ‌మ‌ని ధ్వ‌జ‌మెత్తారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నంచేసింద‌ని తెలిపారు. ప్ర‌జ‌ల‌ను కూడా దోచుకుంద‌న్నారు. మ‌ద్యం కుంభ‌కోణానికి పాల్ప‌డి వేల కోట్ల రూపాయ‌ల‌ను పోగేసుకున్న‌ట్టు చెప్పారు. తిరుమ‌ల శ్రీవారి లడ్డూ ప్ర‌సాదాల‌ను కూడా క‌ల్తీ చేసి.. కోట్లాది రూపాయ‌ల‌ను దోచుకున్న గ‌త ప్ర‌భుత్వం గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని వ్యాఖ్యానించారు.
 
వైసీపీ హ‌యాంలో జ‌రిగిన దోపిడీ నుంచి అక్ర‌మాల వ‌ర‌కు అన్నింటిపైనా విచార‌ణ చేస్తున్న‌ట్టు చంద్ర‌బాబు తెలిపారు. ఏ ఒక్క‌రినీ వ‌దిలి పెట్టేది లేద‌న్నారు. అంద‌రినీ ప‌ట్టుకుని తీరుతామ‌ని ప‌రోక్షంగా జ‌గ‌న్‌ను హెచ్చ‌రించారు. ప్ర‌స్తుత ప్ర‌భుత్వంలో ఒక్క పైసా కూడా అవినీతి లేద‌న్నారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌న్నీ అత్యంత పార‌ద‌ర్శ‌కంగా అమ‌లు చేస్తున్న‌ట్టు చెప్పారు. నిజ‌మైన ల‌బ్ధిదారు ల‌కు ఎలాంటి అన్యాయం జ‌ర‌గ‌కుండా చూస్తున్న‌ట్టు తెలిపారు. గ‌తంలో అన్యాయానికి గురైన వారికి న్యాయం జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు వివ‌రించారు.
 
వైసీపీ హ‌యాంలో తీసుకువ‌చ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌.. రైతుల గుండెల్లో మంట‌లు పెట్టింద‌ని సీఎం వ్యాఖ్యానించారు. త‌మ భూముల‌ను వైసీపీ నాయ‌కులు ఎక్క‌డ దోచుకుంటారోన‌ని రైతులు నిద్ర‌లు లేని రాత్రులు గ‌డిపార‌ని.. అందుకే తాను రాగానే ఈ చ‌ట్టాన్నిర‌ద్దు చేస్తాన‌ని హామీ ఇచ్చిన‌ట్టు గుర్తు చేశారు. ఇచ్చిన హామీ మేర‌కు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ర‌ద్దు చేసిన‌ట్టు వివ‌రించారు. ప్ర‌స్తుతం రైతుల‌కుఎలాంటి ఇబ్బందీ లేని విధంగా రికార్డులు ఇస్తున్నామ‌ని.. వీటిని డిజిటలైజేష‌న్ కూడా చేస్తున్నామ‌ని వివ‌రించారు. క్యూఆర్‌ కోడ్‌తో పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తున్నామని చంద్ర‌బాబు తెలిపారు.
 
రాష్ట్రంలో కొంద‌రు మ‌త విద్వేషాలు రెచ్చ‌గొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చంద్ర‌బాబు హెచ్చరించారు. ఇలాంటి వారిని ఉపేక్షించే ది లేద‌న్నారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ వీరిని ఊరుకోబోమ‌న్నారు. తిరుమ‌ల స‌హా హిందు దేవాల‌యాల‌ను ధ్వంసంచేశార‌ని.. ఇప్పుడు వాటిని ప్ర‌శ్నిస్తుంటే.. కుట్ర పూరితంగా ఇత‌ర మ‌తాల‌ను రెచ్చ‌గొట్టేకార్య‌క్ర‌మానికి పాల్ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు. దీనినిఅరిక‌డ‌తామ‌న్నారు. విద్వేషాలు రెచ్చ‌గొట్టే వారిపై క‌ఠిన‌చ ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. 
Tags
cm chandrababu ex cm jagan destructive regime
Recent Comments
Leave a Comment

Related News