ఆ హీరోతో శ్రీ‌లీల ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైర‌ల్‌!

admin
Published by Admin — May 31, 2025 in Movies
News Image

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీ‌లీల పెళ్లి పీటలెక్కబోతోందని.. సీక్రెట్ గా ఇండస్ట్రీకి చెందిన హీరోతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుందని ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా శ్రీలీల షేర్ చేసిన ఫోటోలే ఈ ప్రచారానికి పునాది వేసింది. శ్రీలీల త్వరలో `ఆషికి 3`తో బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో కార్తీక్ ఆర్యన్ తో శ్రీ‌లీల స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.

అయితే సెట్స్ లోనే కాకుండా బయట కూడా కార్తీక్ ఆర్యన్ తో శ్రీ‌లీల‌ సన్నిహిత్యంగా కనిపించడంతో.. ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు. కార్తిక్‌ ఆర్యన్‌తో శ్రీ‌లీల‌ ప్రేమలో పడిందంటూ కథనాలు కూడా వెలువడ్డాయి. ఇలాంటి తరుణంలో `బిగ్ డే` అంటూ శ్రీలీల తాజాగా త‌న ఇన్‌స్టా స్టోరీలో కొన్ని ఫోటోలను పంచుకుంది. ఈ పిక్స్ లో శ్రీలీల ఆల్మోస్ట్ పెళ్లికూతురులా కనిపించింది.

అలాగే కొందరు ఆమె చెంపలకు పసుపు రాస్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. పైగా ఈ ఫోటోల‌కు `కమింగ్ సూన్` అంటూ శ్రీ‌లీల క్యాప్షన్ కూడా ఇచ్చింది. దాంతో శ్రీలీల పెళ్లి వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. శ్రీ‌లీల లుక్ చూసి చాలా మంది ఆమెకు కార్తీక్ ఆర్యన్ తో ఎంగేజ్మెంట్ జ‌రిగింద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రికొంద‌రు శ్రీ‌లీల పెళ్లికి రెడీ అయిందంటూ చ‌ర్చించుకుంటున్నారు. ఇంకొంద‌రు శ్రీ‌లీల పంచుకున్న ఫోటోలు ఏదైనా కొత్త సినిమా ప్రమోషన్ లేదా వాణిజ్య ప్రకటనకు సంబంధించినవి అయ్యుండొచ్చ‌ని కూడా అంటున్నారు.

శ్రీ‌లీల తాజా ఫోటోల వెనుక మ‌రో వాద‌న వినిపిస్తోంది. జూన్ 14వ శ్రీ‌లీల బ‌ర్త్‌డే. అయితే హిందూ సంప్రదాయం, తిథి ప్రకారం కొన్ని రోజులు ముందే పుట్టినరోజు వ‌స్తుంది. అందులో భాగంగానే శుక్ర‌వారం శ్రీ‌లీల పుట్టిన‌రోజు ఆమె త‌ల్లి సెల‌బ్రేట్ చేశార‌ని అంటున్నారు. ఏదేమైనా శ్రీ‌లీల నోరు విప్పితే కానీ క్లారిటీ వ‌చ్చేలా క‌నిపించ‌డం లేదు. కాగా, శ్రీ‌లీల ప్ర‌స్తుతం తెలుగులో అఖిల్ అక్కినేనితో `లెనిన్‌`, ర‌వితేజ‌తో `మాస్ జాత‌ర‌` మూవీ చేస్తోంది. అలాగే త‌మిళంలో శివ కార్తికేయ‌న్‌తో `పరాశక్తి` చిత్రంలో న‌టిస్తోంది. `జూనియ‌ర్‌` అనే తెలుగు-క‌న్న‌డ ద్విభాషా సినిమాలోనూ శ్రీ‌లీల భాగ‌మైంది.

Tags
Actress Sreeleela Kartik Aaryan Latest news
Recent Comments
Leave a Comment

Related News