జగన్ ఇలాకాలో బాబు సవాల్!

admin
Published by Admin — October 05, 2026 in Andhra
News Image

వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పాత్రతోపాటు మాజీ సీఎం జగన్ పాత్ర ఏమిటో తేల్చాలని చాలా కాలంగా వివేకా తనయురాలు సునీత డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వివేకా హత్య కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో అవినాష్ రెడ్డితోపాటు వివేకా కేసులో నిందితులను ఈడి విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ కేసుపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ సొంత గడ్డ కడప నుంచి ఆయనకు చంద్రబాబు సవాల్ విసిరారు.

ఈ కేసులో అంతిమ లబ్ధిదారుడు ఎవరో తేలిపోయిందని, వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ ఇచ్చారని, ఈ హత్యపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మద్యం స్కామ్ లో కూడా అంతిమ లబ్ధిదారుడు జగనే అని, అన్ని వేళ్లూ ఆయన వైపే చూపిస్తున్నారని ఆరోపణలు చేశారు. కడప గడ్డ నుంచి జగన్ కు సవాల్ విసురుతున్నా... ధైర్యముంటే వీటిపై సమాధానం చెప్పాలి అని ఛాలెంజ్ చేశారు. ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్ పనుల శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. 

జల్ జీవన్ మిషన్ కింద పక్క రాష్ట్రాలు 30 వేల కోట్ల రూపాయలు మొదలు లక్ష కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టాయని, ఇందులో కేంద్రం వాటా 40 శాతం అని, రాష్ట్రం వాటా 60 శాతం అని చెప్పారు. కానీ, ఐదేళ్ల కాలంలో జగన్ కేవలం 2700 కోట్ల రూపాయలు మాత్రమే ఈ మిషన్ కింద ఖర్చు చేశారని ఆరోపించారు. ఇటువంటి జగన్ చరిత్ర అందరూ తెలుసుకోవాలని అన్నారు. గొడ్డలి పార్టీకి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం ఖర్చు చేయడం కూడా చేతకాలేదని ఎద్దేవా చేశారు.

Tags
Cm chandrababu challenge jagan Viveka's case Kadapa
Recent Comments
Leave a Comment

Related News