రేవంత్‌పై ఈడీ కేసు చెల్ల‌దు: కోర్టు సంచ‌ల‌న ఆదేశం

admin
Published by Admin — September 29, 2026 in Telangana
News Image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స‌హా.. వేం. కృష్ణ కీర్తన్, రుద్ర శివకుమార్, ఉదయ్ సింహ, బిషప్ హ్యారీ సెబాస్టియన్‌ల‌పై ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్‌(ఈడీ) దాఖ‌లు చేసిన కేసు చెల్ల‌ద‌ని హైద‌రాబాద్‌లోని ఆర్థిక నేరాల అప్పిలేట్ ట్రైబ్యున‌ల్ తీర్పు వెలువ‌రించింది. ఈ కేసులో స‌రైన ప్రాతిప‌దిక లేద‌ని.. పైగా ఏసీబీ అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్న కేసును ఈడీ ఎలా ఓవ‌ర్ టేక్ చేస్తుంద‌ని న్యాయ‌మూర్తి జస్టిస్ మునీశ్వర్ నాథ్ భండారీ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీఎం రేవంత్ రెడ్డి స‌హా.. ఇత‌రుల‌పై ఈడీ పెట్టిన కేసు చెల్ల‌ద‌ని.. అలానే.. వారిపై న‌గ‌దు జ‌మ చేయాల‌న్న ఒత్తిళ్లు కూడా చేయ‌రాద‌ని ఆదేశించింది. దీంతో సీఎం స‌హా మిగిలిన వారికి భారీ ఉప‌శ‌మ‌నం ల‌భించింది.

అస‌లేంటీ కేసు?

2015లో కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఆ స‌మ‌యంలో బీఆర్ ఎస్ అభ్య‌ర్థిని ఓడించేందుకు నామినేటెడ్ ఎమ్మెల్యేగా ఉన్న స్టీఫెన్‌స‌న్‌కు.. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి సొమ్ములు ముట్ట‌జెప్పార‌న్నది కేసు. ఈ వ్య‌వ‌హారం అప్ప‌ట్లో `ఓటుకు నోటు` పేరుతో పెద్ద ఎత్తున దుమారం రేపింది. ఇది ఇరు రాష్ట్రాల రాజ‌కీయ వ్య‌వ‌హారాల‌పైనా... కీల‌క నాయ‌కుల పైనా తీవ్ర ప్ర‌భావం చూపించింది. మొత్తంగా అప్ప‌ట్లోనే ఏసీబీ ఈ కేసును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని విచారించింది.

ఈ క్ర‌మంలో 50 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను(సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వ‌జూపిన మొత్తం) ఏసీబీ అధికారులుస్వాధీనం చేసుకుని కోర్టుకు స‌మ‌ర్పించా రు. ఎమ్మెల్యే స్టీఫెన్‌స‌న్‌కు మొత్తం 5 కోట్ల రూపాయ‌లు ఇవ్వాల్సి ఉంటుంద‌న్న‌ది అధికారులు చెప్పిన వాద‌న‌. ఈ మేర‌కు ఓటుకోసం డీల్ కుదిరింద‌ని కూడా చెప్పుకొచ్చారు. ఇక‌ ఈ కేసు ఇప్ప‌టికీ హైకోర్టు ప‌రిధిలో కొన‌సాగుతూనే ఉంది. అయితే.. ఆత‌ర్వాత కాలంలో ఎంట్రీ ఇచ్చిన ఈడీ అధికారులు.. ఆ ఐదు కోట్ల రూపాయ‌ల ఒప్పందం.. న‌గ‌దు రూపంలో స్టీఫెన్‌స‌న్‌కు ఇవ్వ‌జూపిన 50 ల‌క్ష‌ల వ్య‌వ‌హారంపై ప్ర‌స్తుత సీఎం రేవంత్ రెడ్డి స‌హా.. అప్ప‌ట్లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌వారిపై మ‌నీ లాండ‌రింగ్ కింద‌ కేసు న‌మోదు చేశారు.

ఈ క్ర‌మంలోనే 50 ల‌క్ష‌ల రూపాయ‌ల విలువైన ఆస్తుల‌ను ఈడీ సీజ్ చేసింది. కానీ, అప్ప‌టికే.. రేవంత్ రెడ్డి ఇవ్వ‌జూపిన మొత్తాన్ని ఏసీ బీ స్వాధీనం చేసుకుని.. కోర్టుకు జ‌మ చేసింది. కానీ.. ఈడీ మాత్రం.. మ‌రో 50 ల‌క్ష‌ల‌రూపాయ‌ల‌కు విలువైన ఆస్తుల‌ను లేదా.. న‌గ‌దును జ‌మ చేయాల‌ని ఒత్తిడి చేసింది. దీనిపై సీఎం రేవంత్ స‌హా.. నాటి వ్య‌క్తులు అప్పిలేట్ ట్రైబ్యున‌ల్‌ను ఆశ్రయించారు. దీనిని విచారించిన కోర్టు.. ఇప్ప‌టికే ఏసీబీ అధికారులు 50 ల‌క్ష‌ల రూపాయ‌లు స్వాధీనం చేసుకున్నార‌ని, సో.. ఇక‌, ఈ విష‌యంలో ఈడీ జోక్యం అవ‌స‌రం లేద‌ని కాబ‌ట్టి కేసులు చెల్ల‌వ‌ని తాజాగా తీర్పు ఇచ్చింది. అలానే వారిపై వేధింపులు స‌రికావ‌ని ఈడీకి స్ప‌ష్టం చేసింది. దీంతో సీఎం స‌హా.. ఇత‌రుకుల ఉప‌శ‌మ‌నం ల‌భించింది. 

 

Tags
Ed case cm revanth reddy wasn't valid says court
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News