జగన్ ఇకపై సింగిల్ సింహం కాదా..?

admin
Published by Admin — September 25, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో ఎప్పుడూ ఒకటే ట్రెండ్ నడవదు. అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క, పడిపోయిన తర్వాత మరో లెక్క ఉంటుంది. గత ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అనుసరిస్తున్న వ్యూహంపై ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎవరితోనూ కలవకుండా, ఒంటరిగానే పోరాడతానంటూ ‘సింగిల్ సింహం’ ట్యాగ్‌తో ముందుకు వెళ్లిన ఆయన, ఇప్పుడు తన రూటు మార్చే ఆలోచనలో ఉన్నారా? తాజా పరిణామాలు చూస్తుంటే ఈ అనుమానం బలపడుతోంది.

ఒంటరి పోరుతోనే నష్టపోయామనే రియలైజేషన్ వైఎస్ క్యాంపులో స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి పార్టీలను విడిగా ఢీకొట్టడం కష్టమనే అంచనాకు వచ్చిన జగన్(Jagan), ఇప్పుడు మిత్రుల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో వామపక్ష నేతలు తాడేపల్లి ప్యాలెస్‌కు క్యూ కట్టడం ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై ఈ నెల 26న విజయవాడలో జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి రావాల్సిందిగా సీపీఐ నేతలు జగన్‌కు స్వయంగా ఆహ్వానం పలికారు. ప్రజా సమస్యల పేరుతో మొదలైన ఈ భేటీ, రాబోయే రోజుల్లో రాజకీయ పొత్తులకు పునాది వేస్తుందా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

ఒకవైపు కూటమి పార్టీలు ఏకమై రాజకీయంగా వైఎస్సార్‌సీపీ(YSRCP)ని కార్నర్ చేస్తుంటే, మరోవైపు సొంత పార్టీ నేతల రాకపోకలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాజకీయాలకు కాస్త గ్యాప్ ఇస్తారనుకున్న విజయసాయిరెడ్డి మళ్లీ ఎంట్రీ ఇవ్వడం, కొత్త అడుగులు వేయడం లాంటి పరిణామాలు తాడేపల్లిలో కొత్త వ్యూహాలకు తెరలేపుతున్నాయి. ఒంటరిగా యుద్ధం చేస్తే ఫలితం ఉండదనే వాస్తవాన్ని గ్రహించిన జగన్.. ఇప్పుడు లెఫ్ట్ పార్టీలతో చేతులు కలిపి జాతీయ స్థాయి ‘ఇండియా’ కూటమి వైపు అడుగులు వేస్తారా? లేక కేవలం తాత్కాలిక పోరాటాల వరకే పరిమితమవుతారా? అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా, జగన్ ఇకపై పూర్తిగా 'సింగిల్'గా ఉండేలా కనిపించడం లేదు.

Tags
YS Jagan YSRCP CPI Leaders Andhra Pradesh AP Politics AP News Tadepalli Palace Left Alliance
Recent Comments
Leave a Comment

Related News