వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మరింత ఉచ్చు బిగుసుకుంది. నెల్లూరు జిల్లా రుస్తుం బాదలోని క్వార్ట్జ్ గనులను అక్రమంగా తవ్వడం ద్వారా రూ.250 కోట్ల మేరకు అక్రమాలకు పాల్పడ్డారని అధికారులకు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఇక్కడి గిరిజనులను బెదిరించారన్న ఫిర్యాదులు రావడంతో మరిన్ని కేసులు నమోదయ్యాయి.