ప‌వ‌న్ త‌న‌యుడికి ప్ర‌మాదం.. సింగ‌పూర్‌కు డిప్యూటీ సీఎం!

News Image

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కళ్యాణ్ సడెన్ గా సింగపూర్ పయనమవుతున్నారు. ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురయ్యాడు. సింగపూర్‌లోని ఓ స్కూల్ లో మార్క్ శంకర్ చదువుకుంటున్నాడు. అయితే తాజాగా ఆ స్కూల్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంట‌లు చెల‌రేగ‌డంతో మార్క్ శంకర్ చేతులు, కాళ్ల‌కు గాయాలు అయ్యాయి. అలాగే ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన మార్క్ ను స్కూల్ సిబ్బంది ఆస్ప‌త్రికి త‌రలించారు.

 

Recent Comments
Leave a Comment

Related News