రైతుల‌కు శాపం: జ‌గ‌న్ అదే వ‌ర‌స‌!

admin
Published by Admin — February 19, 2025 in Politics
News Image

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. మ‌రోసారి ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. రైతుల పాలిట కూట‌మి ప్రభు త్వం శాపంగా మారింద‌న్నారు. రైతులు పండించే ఏ పంట‌కూ గిట్టుబాట ధ‌ర ల‌భించడం లేద‌ని తెలి పారు. తాజాగా గుంటూరులోని మిర్చియార్డులో ప‌ర్య‌టించిన జ‌గ‌న్.. మిర్చి రైతుల క‌ష్టాలు తెలుసుకున్నా రు. తొలుత వారితో ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా రైతులు త‌మ క‌ష్టాలు చెప్పుకొన్నారు. కొన్నాళ్లుగా మిర్చిని కొనుగోలు చేయ‌డం లేద‌ని వారు వివ‌రించారు.

నెలల త‌ర‌బ‌డి మిర్చియార్డులోనే త‌మ పంట‌ను నిల్వ చేసుకోవాల్సి వ‌స్తోంద‌న్న రైతులు.. ద‌ళారుల రంగ ప్ర‌వేశంతో అందిన కాడికి అమ్ముకోవాల్సి వ‌స్తోంద‌న్నారు. క‌ల్తీ విత్త‌నాల‌తో న‌ష్ట‌పోయామ‌ని మ‌రికొంద‌రు రైతులు వివ‌రించారు. అనంత‌రం జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుతూ.. కూట‌మిప్ర‌భుత్వం రైతుల‌కు చేసింది ఏమీలేద‌న్నారు. రైతులు అన్ని విధాలా న‌ష్ట‌పోయార‌ని విమ‌ర్శించారు. రైతుల‌కు న‌కిలీ విత్త‌నాలు విక్ర‌యించాలంటే గతంలో భ‌య‌ప‌డే ప‌రిస్థితిని తీసుకువ‌చ్చామ‌ని త‌మ పాల‌న‌ను ఉటంకించారు.

కానీ, ఇప్పుడు టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లే న‌కిలీ విత్త‌నాల‌ను రైతుల‌కు విక్ర‌యిస్తున్నార‌ని ఆరోపించా రు. ఎరువుల ధ‌ర‌ల‌ను రూ.500 పెంచి అమ్మినా.. ప‌ట్టించుకునే నాథుడు లేకుండా పోయార‌ని దుయ్య‌బ ట్టారు. రైతుల‌కు ఇస్తామ‌న అన్న‌దాత సుఖీభ‌వ నిధులు ఏమ‌య్యాయ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌మ పాల‌న‌లో క్వింటా మిర్చికి రూ.21 వేల నుంచి 27 వేల వ‌ర‌కు ధ‌ర గిట్టుబాటు అయింద‌న్న జ‌గ‌న్‌.. ఇప్పుడు దీనిలో స‌గం కూడా రావ‌డం లేద‌ని.. అయినా స‌ర్కారు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు.

ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న నేపథ్యంలో గుంటూరులో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉంది. దీంతో ఎన్నిక‌ల అధికారులు, పోలీసులు కూడా జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కుఅ నుమ‌తించ‌లే దు. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న త‌న పంతం నెగ్గించుకున్నారు. కేవ‌లం ప‌రామ‌ర్శేన‌ని చెప్పిన జ‌గ‌న్‌.. తీరా మిర్చియార్డుకు వ‌చ్చిన త‌ర్వాత‌.. త‌న‌దైన శైలిలో ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. రైతుల‌తో ముచ్చ‌టించారు. కాగా.. ఈ వ్య‌వ‌హారంపై టీడీపీ నాయ‌కులు ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

Recent Comments
Leave a Comment

Related News