అరవ శ్రీధర్ పై జనసేన చర్యలు

admin
Published by Admin — January 28, 2026 in Andhra
News Image
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ వివాహిత సంచలన ఆరోపణలు చేసిన సంగతి ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ప్రభుత్వ ఉద్యోగి అయిన సదరు మహిళను శ్రీధర్ బెదిరించి లైంగికంగా లోబరుచుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, ఆమెతో శ్రీధర్ నగ్నంగా వీడియో కాల్ మాట్లాడారంటూ ఓ మీడియా ఛానెల్ లో కథనం వచ్చింది. ఈ నేపథ్యంలోనే శ్రీధర్ పై జనసేన రాష్ట్ర కమిటీ చర్యలకు ఉపక్రమించింది. 
 
శ్రీధర్ పై ఆ మహిళ చేసిన ఆరోపణలపై విచారణ చేసేందుకు ముగ్గురు జనసేన నేతలతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అరవ శ్రీధర్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపడతామని, వారం రోజుల్లోపు ఆ కమిటీ ముందు అరవ శ్రీధర్ హాజరై వివరణనివ్వాలని జనసేన రాష్ట్ర కమిటీ ఆదేశించింది. ఆ కమిటీ నివేదిక పరిశీలించి ఈ వ్యవహారంపై తుది నిర్ణయం తీసుకునే వరకూ అరవ శ్రీధర్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.
Tags
janasena mla arava sridhar janasena chief pawan kalyan action sex scandal
Recent Comments
Leave a Comment

Related News