ఆ హీరోకి వియ్యంకురాలు కాబోతున్న రోజా

admin
Published by Admin — January 04, 2026 in Movies
News Image

ఫైర్ బ్రాండ్ వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా గతంలో సినీ నటిగా రాణించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోని అగ్రహీరోలందరితో రోజా సినిమాల్లో నటించారు. ఆమె రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఈ క్రమంలోనే రోజా కూతురు అన్షు ఆమె నట వారసత్వాన్ని కొనసాగించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఓ స్టార్ హీరో ఇంటికి అన్షు కోడలు కాబోతోందని పుకార్లు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ పుకార్లకు రోజా తెర దించారు.

అన్షుకు సినీ రంగంపై ఆసక్తి లేదని, నటి కావాలన్న ఆసక్తి, కోరిక లేవని రోజా క్లారిటీనిచ్చారు. అంతేకాదు, అన్షు సైంటిస్ట్ కావాలనుకుంటోందని, అమెరికాలో చదువుతోందని చెప్పారు. తన పిల్లల భవిష్యత్తును వారే నిర్ణయించుకుంటారని అన్నారు. తన కూతురు ఏ స్టార్ హీరో ఇంటికి కోడలిగా వెళ్లబోతోందో తనకూ చెప్పాలని, తాను కూడా తెలుసుకొని సంతోషిస్తానని రోజా చమత్కరించారు. దీంతో, ఆ హీరోకి వియ్యంకురాలు కాబోతున్న రోజా అంటూ వస్తున్న పుకార్లకు తెరపడినట్లయింది.

Tags
RK Roja Roja's daughter anshu Movie debut
Recent Comments
Leave a Comment

Related News

Latest News