నాచే నాచే..ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలే

admin
Published by Admin — January 04, 2026 in Movies
News Image

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, టాలీవుడ్ డైరెక్టర్ మారుతిల కాంబోలో తెరకెక్కిన రాజా సాబ్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇక, తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ కు మరింత ఊపిచ్చేలాగా ఆ చిత్రం నుంచి నాచే నాచే సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ అయిన నాచే నాచే ట్యూన్ ను సంగీత దర్శకుడు థమన్ రీమిక్స్ చేశాడు. అదిరిపోయే మాస్ బీట్ తో ఉన్న ఈ పాట ఫుల్ లెంగ్త్ వెర్షన్ ను జనవరి 5న విడుదల చేయబోతున్నారు. ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ స్టెప్పులేసిన ఈ పాటకు థియేటర్లో ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలు ఖాయం. సలార్ లో పాటలకు పెద్దగా స్కోప్ లేకపోవడంతో ఈ చిత్రంలో ఫ్యాన్స్ కు సాంగ్స్ ఫీస్ట్ ఇవ్వాలని ప్రభాస్, మారుతి ఫిక్సయినట్లు కనిపిస్తోంది.

YouTube Thumbnail

Tags
Nache Nache song promo raha saab movie Hero prabhas
Recent Comments
Leave a Comment

Related News

Latest News