`వినయ విధేయ రామ`, `స్కంధ` వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అనంతరం దర్శకుడు బోయపాటి శ్రీను ‘అఖండ 2’తో గట్టిగానే కంబ్యాక్ ఇచ్చాడు. తనకు అచ్చొచ్చిన హీరో నందమూరి బాలకృష్ణతో కలిసి మరోసారి తన స్టైల్ ఏమిటో నిరూపించాడు. మాస్, యాక్షన్, పవర్‌ఫుల్ ఎలివేషన్లు… బోయపాటి మార్క్ అంతా ‘అఖండ 2’లో ఫుల్‌గా కనిపించడంతో, ఈ విజయం దర్శకుడికి పెద్ద ఊరటనిచ్చింది.
ఈ విజయం తర్వాత బోయపాటి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ హీరోతో అన్నది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతానికి టాప్ హీరోలందరూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో, ఎవరు అందుబాటులోకి రావాలన్నా కనీసం ఏడాది సమయం పట్టే పరిస్థితి ఉంది. ఇలాంటి తరుణంలో బోయపాటి నెక్స్ట్ మూవీ కోసం వినిపిస్తున్న పేరు అల్లు అర్జున్. బన్నీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. ఆ సినిమా షెడ్యూల్స్ త్వరగా పూర్తవుతాయని, ఆ తర్వాత బోయపాటితో మళ్లీ పని చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సరైనోడు’ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అప్పట్లో అల్లు అర్జున్ కెరీర్‌లో అది పెద్ద మైలురాయిగా మారింది. అదే కాంబినేషన్ మరోసారి సెట్ అయితే, బోయపాటి–బన్నీ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడటం ఖాయం. ముఖ్యంగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఓ సినిమా చేయడానికి బోయపాటి ఇప్పటికే అడ్వాన్స్ తీసుకున్నారన్న టాక్ ఈ కాంబోకు మరింత బలం ఇస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఫైనల్ కావడం పెద్ద కష్టమేమీ కాదని ఇన్‌సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక మాస్‌కు తగ్గ ఎలివేషన్లు, బన్నీ స్టైల్ యాక్షన్, బోయపాటి మార్క్ ట్రీట్ కలిసి వస్తే బాక్సాఫీస్ వద్ద మరోసారి రచ్చ ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.