ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. వరుస భేటీలతో లోకేష్ బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో లోకేష్ భేటీ అయ్యారు. విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ ఏర్పాటు చేయాలని జయంత్ చౌదరికి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రదాన్ లతో కూడా లోకేష్ భేటీ కాబోతున్నారు.
విద్య, ఐటీ శాఖలకు సంబంధించిన పలు అంశాలపై వారిద్దరితో లోకేష్ చర్చించబోతున్నారు. కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో భేటీకి ముందు టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో టీడీపీ ఎంపీలతో లోకేష్ సమావేశమయ్యారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సభలో మాట్లాడాల్సిన విషయాలు, ప్రస్తావించవలసిన అంశాలపై తెలుగుదేశం పార్టీ ఎంపీలకు లోకేష్ దిశా నిర్దేశం చేశారు.