మైలవరం. ఉమ్మడి కృష్నాజిల్లాలోని కీకలమైన నియోజకవర్గం. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి టీడీ పీలోకి వచ్చిన వసంత కృష్ణప్రసాద్, అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత.. పరిణామాలు మారాయి. అప్పటి వరకు పెడనలో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్.. మైలవరంపై పట్టుకో సం ప్రయత్నించారు. వైసీపీ అధినేత జగన్‌కు కేవలం సూచన ప్రాయంగా సమాచారం చేరవేసి.. ఆయన నేరుగా మైలవరం రాజకీయాలు చేయడం ప్రారంభించారు.
దూకుడుగా కూడా వ్యవహరించి జోగి విషయంలో పార్టీ కూడా మౌనంగా ఉంది. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే వసంతపై.. జోగి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అక్రమాలు చేస్తున్నారంటూ.. మండిపడుతు న్నారు. అయితే.. ఏ నాయకుడు అయినా.. ప్రజల మధ్య ఉండాలి. వారి సమస్యలు తెలుసుకోవాలి. ఈ విషయంలో ఏమేరకు దూకుడుగా ఉంటే అది ఫలిస్తుంది. కానీ, జోగి మాత్రం వ్యక్తిగతంగా ఎమ్మెల్యే వసంతను టార్గెట్ చేస్తుండడంతో ఆయన అనుకున్న విధంగా అయితే.. గ్రాఫ్ పెరగలేదు.
పైగా.. ఎప్పుడో వదిలేసి వెళ్లిన నియోజకవర్గానికి తిరిగి వచ్చినా.. ప్రజలు కూడా జోగిని పెద్దగా పట్టించుకోవ డం మానేశారు. ఒకప్పుడు బడ్డీకొట్ల దగ్గర, టీ కొట్ల దగ్గర.. కూడా జోగి గురించిన ప్రస్తావన రాగా.. ఇప్పుడు అలాంటి దేమీ లేదనేది స్థానికంగావినిపిస్తున్న మాట. ఇదిలావుంటే.. మరోవైపు నకిలీ మద్యం వ్యవహారం లో జోగి రమేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన ప్రోద్బలంతోనే.. తాను మద్యం తయారు చేసినట్టు ఈ కేసులో సూత్రధారి అద్దేపల్లి జనార్దన్‌రావు చెబుతున్నారు.
దీనిపై కూపీ లాగుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా.. జోగి చుట్టూ ఉచ్చుపన్నుతున్నట్టు సమాచారం. ఇది ఇప్పటి వరకు ఉన్న కేసులకు భిన్నంగా మారనుంది. ఎందుకంటే.. మద్యం అనేది సాధారణ ఓటు బ్యాంకును తీవ్రంగా ప్రభావితం చేసే అంశం. సో.. ఈ క్రమంలో తాజాగా నకిలీ మద్యం వ్యవహారంలో జోగి ప్రమేయాన్ని అధికారికంగా నిర్ధారిస్తే.. జోగికి తిప్పలు తప్పవన్న వాదన వినిపిస్తోంది. ఇది.. ఓటు బ్యాంకు రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. సో.. అప్పుడు మైలవరం నియోజకవర్గంలో వైసీపీ పుంజుకోవడం.. వ్యక్తిగతంగా స్థిరపడడం పెద్ద సమస్యేనని అంటున్నారు పరిశీలకులు.