 
    కాలిఫోర్నియాలోని ఎల్క్ గ్రోవ్ నగరంలో డిస్ట్రిక్ట్ 56 వద్ద 6వ వార్షిక దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. సిటీ ఆఫ్ ఎల్క్ గ్రోవ్ డైవర్సిటీ & ఇన్క్లూషన్ కమిషన్ భాగస్వామ్యంతో యూఎస్ఏ సనాతన్ నిర్వహించిన ఈ ఉచిత కమ్యూనిటీ కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఉత్సాహభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు, అద్భుతమైన ఫ్యాషన్ షో మరియు దీపాల వెలుగుల మధ్య ఈ వేడుక కన్నుల పండువగా జరిగింది.
ప్రభుత్వ అధికారులు మరియు కమ్యూనిటీ నాయకులు, అతిథులు అందరూ కలిసి రుచికరమైన విందును, సంప్రదాయ దీపావళి మిఠాయిలను ఆస్వాదించారు. చీకటిపై వెలుగు...అజ్ఞానంపై జ్ఞానం...చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి వేడుకను జరుపుకుంటారని ఈ కార్యక్రమ ప్రధాన నిర్వాహకుడు భవిన్ పారిఖ్ అన్నారు. కమ్యూనిటీలోని ప్రజలంతా కలిసి ఈ వేడుక జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.
ఎల్క్ గ్రోవ్ నగరపు సమ్మిళిత నిబద్ధతను  ఎల్క్ గ్రోవ్ నగర మేయర్ బాబీ సింగ్-అల్లెన్ కొనియాడారు. అమెరికాలోని వైవిధ్యమైన నగరాల్లో ఎల్క్ గ్రోవ్ ఒకటని, అన్ని మతాల, జాతుల, ప్రాంతాల వారిని తన నగం స్వాగతిస్తుందని చెప్పారు.
అసెంబ్లీ బిల్లు 268పై  అక్టోబర్ ప్రారంభంలో గవర్నర్ గవిన్ న్యూసమ్  సంతకం చేసిన నేపథ్యంలో ఈ సంవత్సరం వేడుకలు మరింత ప్రాధాన్యతను సంతరించకున్నాయి. కాలిఫోర్నియా రాష్ట్రపు అధికారిక సెలవు దినంగా దీ పావళికి గుర్తింపునిచ్చే ఆ చట్టం జనవరి 1, 2026 నుండి అమలులోకి వస్తుంది. కమ్యూనిటీ కళాశాలలు మరియు ప్రభుత్వ పాఠశాలలు దీపావళి రోజు సెలవు ఇవ్వవచ్చు. రాష్ట్ర ఉద్యోగులు ఆ రోజు సెలవు తీసుకోవచ్చు. దీపావళినాడు కొన్ని పాఠశాలలు మరియు కళాశాల సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు లభిస్తుంది.
దివాళీ లేదా దీపావళిని హిందూ, సిక్కు, జైన సమాజాలు ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటాయి. ఏడాదిలో చివరి పంట తర్వాత...అంటే సాధారణంగా అక్టోబర్ లేదా నవంబర్‌లో ఈ పండును భారతీయులు జరుపుకుంటారు. కాలిఫోర్నియా, పెన్సిల్వేనియా ,కనెక్టికట్‌లు దీపావళి పండుగను  అధికారికంగా గుర్తించాయి. న్యూజెర్సీ, న్యూయార్క్ నగరాలలోని పాఠశాలలు కూడా దీపావళిని గుర్తించాయి.
2004లో యూఎస్ఏ సనాతన్ కల్చరల్ & స్పోర్ట్స్ అసోసియేషన్ ను స్థాపించారు. గ్రేటర్ శాక్రమెంటో ప్రాంతంలో సాంస్కృతిక వేడుకలు, సమాజ సేవకు ఈ అసోసియేషన్ మూలస్తంభంగా నిలుస్తూ వస్తోంది. సంప్రదాయాన్ని గౌరవించే మరియు సమాజ విలువలను పెంపొందించే సమ్మిళిత కార్యక్రమాల ద్వారా సాంస్కృతిక అవగాహన, ఐక్యత మరియు వారసత్వాన్ని ఈ సంస్థ ప్రోత్సహిస్తుంది.
 
                 
                 
                 
                .jpeg) 
                 
                .jpeg) 
                .jpeg) 
                .jpeg) 
                .jpeg) 
                .jpeg) 
                .jpeg) 
                .jpeg) 
                .jpeg) 
                .jpeg) 
                .jpeg) 
                .jpeg) 
                .jpeg) 
                .jpeg)