ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు ఈ రోజు నారావారిపల్లెలో పర్యటించారు. చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు ప్రథమ వర్థంతి సందర్భంగా జరిగిన సంవత్సరీకం కార్యక్రమంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్ తదితరులు పాల్గొన్నారు. రామ్మూర్తినాయుడు తనయుడు, టాలీవుడ్ నటుడు నారా రోహిత్ తన తండ్రి సంవత్సరీకం క్రతువు పూర్తి చేశారు.
చంద్రబాబు కుటుంబ సభ్యులు, రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులందరూ కలిసి రామ్మూర్తినాయుడు స్మృతివనం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన స్మృతులను గుర్తుచేసుకుని పుష్పాంజలి అర్పించారు. ఈ కార్యక్రమంలో నారావారి కుటుంబంతో పాటు ఇతర బంధువులు కూడా పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.