భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్, అంతకు మించిన టాలెంట్ ఉన్న సరైన హిట్ లేక సతమతం అవుతున్న టాలీవుడ్ హీరోల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒకరు. `ఛత్రపతి` హిందీ రీమేతో బాలీవుడ్‌లో బొక్క బార్ల పడ్డ బెల్లంకొండ మళ్లీ టాలీవుడ్ వైపు టర్న్ తీసుకున్నాడు. రీసెంట్ గా `భైరవం` మూవీతో అదృష్టం పరీక్షించుకున్నప్పటికీ నిరాశే ఎదురైంది. అయితే ఈసారి `కిష్కింధపురి` అంటూ హారర్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను అలరించేందుకు బెల్లంకొండ శ్రీనివాస్ సిద్ధమయ్యాడు.
షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాకు కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బెల్లంకొండ.. డేరింగ్ స్టేట్మెంట్ పాస్ చేశాడు.
`రెండున్నర గంటలపాటు అన్నీ మర్చిపోయి ఆడియన్స్ ను సినిమాలో లీనం చేసే సత్తా కిష్కింధపురికి ఉంది. మూవీ చూస్తున్నప్పుడు ప్రేక్షకులు తమ మొబైల్ పట్టుకోకపోతే మనం సక్సెస్ అయినట్టే. ఈ చిత్రం కూడా అలాంటిదే. సినిమా స్టార్ట్ అయిన పది నిమిషాల తర్వాత ఎవరైనా ప్రేక్షకులు తమ మొబైల్ బయటకు తీశారంటే నేను ఇండస్ట్రీని వదిలేస్తా` అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో ఇప్పుడు ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. సినిమాపై ఎంత నమ్మకం ఉన్నప్పటికీ బొల్లంకొండ తొందరపడి అటువంటి స్టేట్‌మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బొల్లంకొండ మాటల్లో కిష్కింధపురి విజయంపై ధీమా కనిపిస్తోందని అంటున్నారు.