సరిగ్గా రెండేళ్ల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అర్ధరాత్రి చంద్రబాబు కాన్వాయ్ తలుపులు కొట్టి మరీ నిద్రపోతున్న చంద్రబాబును అరెస్టు చేశారు. ఆధారాలు లేని కేసులు బనాయించి చంద్రబాబును జైల్లో పెట్టి పైశాచికానందం పొందారు. అయితే, ఆ కేసులు ఎక్కువ కాలం నిలబడలేదు. చంద్రబాబును జైల్లో పెట్టి నేటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ చేదు జ్నాపకాలను మంత్రి లోకేశ్ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆనాటి ఘటనను గుర్తు చేసుకుంటూ ఎక్స్ లో భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు లోకేశ్.
"రెండేళ్ల క్రితం.. ఇదే రోజున... మా నాన్న చంద్రబాబు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఈ ఘటన మా కుటుంబంలోనే కాదు, ప్రజాస్వామ్యంలోనే ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. ఆ బాధ ఇప్పటికీ మిగిలే ఉంది... అయినప్పటికీ మా సంకల్పం మరింత బలపడింది. ఆయన ధైర్యం, హుందాతనం, ఆంధ్రప్రదేశ్ ప్రజలపై అచంచలమైన నమ్మకం... న్యాయం, సత్యం కోసం మా పోరాటానికి స్ఫూర్తినిస్తోంది" అని లోకేశ్ ఎమోషనల్ అయ్యారు.