2024లో ఏపీ సీఎంగా చంద్రబాబు పగ్గాలు చేపట్టినప్పటి తర్వాత ఒక సరికొత్త నినాదానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఒక కుటుంబం-ఒక వ్యాపారవేత్త అనే నినాదాన్ని చంద్రబాబు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒన్ ఫ్యామిలీ-ఒన్ ఎంట్రప్రన్యూర్ అంటూ చంద్రబాబు యువతకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ నినాదానికి చంద్రబాబు మరో సరికొత్త పేరు పెట్టారు. యువ పారిశ్రామికవేత్తలు కొత్త రంగాల్లోకి అడుగుపెట్టి సత్తా చాటాలని, ‘ఆంధ్రా ప్రెన్యూర్స్’ అనే పేరు నిలబెట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ప్రభుత్వ పాలసీలను వినియోగించుకుని అంతర్జాతీయ స్థాయికి తమ సంస్థలను తీసుకెళ్లాలని ఆయన అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047కు అనుగుణంగా రాష్ట్రంలో పారిశ్రామిక ఎకో సిస్టంను సిద్ధం చేస్తున్నామన్నారు. యువ ఎంపీ భరత్ తో పాటు పలువురు యువ పారిశ్రామికవేత్తలతో భేటీ సందర్భంగా చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమల ద్వారా సంపద సృష్టించి సమాజానికి సేవలందించాలని యువ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.
ఏపీలో వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలున్నాయని, ఆయా రంగాల్లోని అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. విశాఖ-చెన్నై మధ్య నాలుగు లేన్ల రైల్వే లైన్ ప్రాజెక్టుతో ఈ ప్రాంత పరిస్థితి పూర్తిగా మారుతుందని అన్నారు. అమరావతి-హైదరాబాద్-బెంగళూరు-చె