లాంగ్ గ్యాప్ అనంతరం స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి నుండి రాబోతున్న లేటెస్ట్ యాక్షన్ క్రైమ్ డ్రామా `ఘాటీ`. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించారు. విక్రమ్ ప్రభు, చైతన్య రావు, జగపతి బాబు తదితరులు ఈ మూవీలో ముఖ్యమైన పాత్రలు పోషించారు. పలు వాయిదాల అనంతరం సెప్టెంబర్ 5న ఘాటీ రిలీజ్‌కు రెడీ అయింది.
తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ సినిమా విడుదల కాబోతుంది. అయితే మూవీకి ఉన్న హైప్, అనుష్క క్రేజ్ దృష్ట్యా ఘాటీకి సాలిడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ వీకెండ్ లో రిలీజ్ కాబోయే మూవీస్ లో ఘాటీనే ఎక్కువ బిజినెస్ సొంతం చేసుకుని అదరగొట్టింది.
నైజాంలో రూ. 6.5 కోట్లు, సీడెడ్ లో రూ. 3.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రానికి ఆంధ్రలో రూ. 9 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో టోటల్ బిజినెస్ రూ. 19 కోట్లు కాగా.. వరల్డ్ వైడ్‌గా రూ. 29 కోట్లు బిజినెస్ ను దక్కించుకుంది. సో.. ఘాటీతో హిట్ అందుకోవాలంటే స్వీటీ ముందున్న టార్గెట్ రూ. 30 కోట్లు. ఫుల్ రన్ లో ఈ టార్గెట్ ను రీచ్ అయితే సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్లే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.