దేవినేని ఉమ కుమారుడి పెళ్లికి సీఎం రేవంత్, లోకేశ్

News Image

టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమ కుమారుడు నిహార్‌ పెళ్లి వేడుక నేడు ఘనంగా జ‌రిగింది. ఈ క్రమంలోనే ఈ పెళ్లికి తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి నారా లోకేశ్, సీఎం చంద్రబాబు సతీమణి నారా భువ‌నేశ్వ‌రి, మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు, సుప్రీంకోర్టు రిటైర్డ్ సీజీఐ ఎన్‌వీ ర‌మ‌ణ‌లతో పాటు ఏపీ, తెలంగాణ‌కు చెందిన ప‌లువురు ముఖ్య నేత‌లు హాజ‌ర‌య్యారు.

తెలంగాణ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన అనంతరం రేవంత్ రెడ్డి తొలిసారి విజయవాడ వచ్చారు. ఈ క్రమంలోనే రేవంత్‌కు హెలిప్యాడ్ వ‌ద్ద మంత్రులు ప‌య్యావుల కేశ‌వ్‌, నిమ్మ‌ల రామానాయుడు, బీసీ జ‌నార్ధ‌న్ రెడ్డి ఘన స్వాగ‌తం ప‌లికారు. మంత్రి లోకేశ్‌, సీఎం రేవంత్ రెడ్డి క‌లిసి నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. వీరిద్దరూ సమకాలీన రాజకీయాలపై కాసేపు చర్చించుకున్నారని తెలుస్తోంది.

గతంలో టీడీపీ నేతగా కీలక బాధ్యతలు పోషించిన రేవంత్ రెడ్డి నేడు తెలంగాణ సీఎంగా సమర్థవంతంగా పాలన అందిస్తున్న సంగతి తెలిసిందే. మాజీ టీడీపీ నేత అయిన రేవంత్ కు పార్టీలో ఉమతో పాటు చాలామంది కీలక నేతలతో సత్సంబంధాలున్నాయి. ఇక, మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ భావి సీఎం అని టీడీపీ నేతలు భావిస్తున్న నారా లోకేశ్...రేవంత్ రెడ్డిల కలయిక హాట్ టాపిక్ గా మారింది.

Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News