అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా.. హైదరాబాద్‌లోని సంధ్య ధియేటర్ వద్ద.. తొక్కిసలాట చోటు చేసుకుని ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు కూ డా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాలను కూడా కుదిపే సింది. అయితే.. తర్వాత ఈ కేసు దాదాపు సర్దుబాటు అయినప్పటికీ.. జాతీయ మానవహక్కుల సంఘం మాత్రం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది.
ఘటన జరిగిన సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరిన హక్కుల సంఘం.. దీనిపై అసం తృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికే పంపించిన నివేదిక పారదర్శకంగా లేదని ఆక్షేపించింది. పైగా.. పోలీ సులు ఈ నివేదికలో పేర్కొన్న అంశాలను ప్రస్తావించిన సంఘం.. వాటిపై కూడా వివరణ కోరింది. సంధ్య థియేటర్ వద్ద.. ప్రీమియర్ షోకు అనుమతి లేదని.. తమకు ఇచ్చిన నివేదికలో పేర్కొనట్టు మానవ హక్కు ల సంఘం తెలిపింది. అనుమతి లేని షోకు.. ప్రేక్షకులు ఎలా వచ్చారు? టికెట్లు ఎలా విక్రయించారు? అని ప్రశ్నించింది.
అదేవిధంగా నటులు, అభిమానులను ఎందుకు అనుమతించారని సంఘం ప్రశ్నించారు. ఇక, మృతురా లి కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చే విషయాన్ని కూడాస్పష్టంగా పేర్కొనలేదని సంఘం ఆక్షేపించింది. ఆమె కుటుంబానికి ఓ 5 లక్షలు ఎందుకు ఇవ్వకూడదని తాజాగా పంపించిన లేఖలో ప్రశ్నించింది. ``ఐ దు లక్షలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నామా?`` అని వ్యాఖ్యానించడం గమనార్హం. అలాగే.. తొక్కిసలాట కు గల కారణాలపైనా అసంతృప్తి వ్యక్తం చేసిన.. జాతీయ మానవ హక్కుల సంఘం.. దీనిపై ఆమూలాగ్రం మరోసారి విచారణ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి.. తాజాగా లేఖ సమర్పించింది. గతంలో ఇచ్చిన నివేదికను తిప్పిపంపించింది. ఘటనపై మరోసారి పూర్తిగా విచారణ చేసి.. తమకు నివేదిక అందించాలని పేర్కొంది. దీనికి ఆరు వారాల పాటు గడువు ఇస్తున్నట్టు జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పష్టం చేసింది. దర్యాప్తు విషయంలో ఎలాంటి పాక్షికత్వాన్ని ప్రదర్శించరాదని తెలిపింది. నిష్పాక్షిక దర్యాప్తు చేయాలని పేర్కొం ది. దీంతో ఈ ఘటన మరోసారి విచారణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.