తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బీఆర్ ఎస్ పార్టీ ఖాళీ అవుతుందన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ ఎస్ పార్టీ పూర్తిగా విఫలమైందని.. తామే ప్రధాన ప్రతి పక్షంగా అవతరించనున్నట్టు చెప్పారు. ప్రజల సమస్యలను బీఆర్ ఎస్ నాయకులు ఒక్కరు కూడా పట్టిం చుకోవడంలేదన్నారు. కాళేశ్వరం.. అవినీతి అంటూ.. బీఆర్ ఎస్ నాయకులు దాని ఊబిలో కూరుకుపో యారని చెప్పారు. ప్రభుత్వం కూడా పనిచేయడం మానేసిందన్నారు.
అధికార, విపక్ష పార్టీలు రెండూ.. ప్రజల సమస్యలను గాలికి వదిలి.. సొంత ప్రయోజనాల కోసం పాకులా డుతున్నాయని రాంచందర్‌రావు విమర్శించారు. అందుకే...ప్రజల సమస్యలపై తామే పోరాడుతున్నా మన్నారు. రాష్ట్రంలో బీఆర్ ఎస్ పార్టీ నుంచి కీలక నాయకులు అందరూ తమ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. త్వరలోనే ఆ పార్టీ ఖాళీ అయినా ఆశ్చర్యం లేదని వ్యాఖ్యానించారు. అదేవిధంగా కాంగ్రెస్‌లోని అసంతృప్త నాయకులు.. కూడా లెక్కకు మిక్కిలిగా తమ పార్టీ చెంతకు చేరుతున్నారని తెలిపారు.
అయితే.. ప్రస్తుతం ముహూర్తాలు చూసుకుంటున్నారన్న రాంచందర్‌రావు.. వారి వీలును చూసుకుని పా ర్టీలో చేరనున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రజల కోసం పనిచేసే ఎవరికోసమైనా బీజేపీ తలుపులు ఎప్పు డూ తెరిచే ఉంటాయని రాంచందర్‌రావు పేర్కొన్నారు. అందుకే.. అధికార పక్షంలో ఉన్న నాయకులు కూడా బీజేపీ కండువా కప్పుకొనేందుకు రెడీ అయ్యారని తెలిపారు.
``చాలా మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు. బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ నేత లు కూడా మా పార్టీవైపు చూస్తున్నారు. ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ మొత్తం కేసీఆర్ డైరెక్షన్ లో జరిగిన స్క్రిప్ట్. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దీంతో తెలంగాణ అభివృద్ధి ఓ లెవిల్‌కు చేరుకుంటుంది`` అని రాంచందర్ రావు వ్యాఖ్యానించారు.