సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో `కూలీ` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ డ్రామాలో నాగార్జున విలన్ గా నటించారు. ఉపేంద్ర, సత్యరాజ్, శృతిహాసన్, సౌబిన్ షాహిర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషించగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మితమైన కూలీ చిత్రం ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే చైనాలో గ్రాండ్ గా కూలీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు.
ఈ ఈవెంట్ లో రజనీకాంత్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రజనీకాంత్ మాట్లాడుతూ.. తన లైఫ్ లో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఒకానొక టైంలో తాను కూలీగా బ్యాగులు మోయాల్సి వచ్చిందని రజని తెలిపారు. అయితే `ఒకరోజు తాను రోడ్డుపై నిలబడి ఉండగా ఒక వ్యక్తి నన్ను పిలిచి లగేజ్‌ను టెంపో వరకు తీసుకెళ్తావా? అని అడిగాడు. అందుకు నేను సరే అన్నారు. అతన్ని చూస్తే తెలిసిన వ్యక్తులా ఉన్నాడు.
కొద్దిసేపటికి ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నట్టు గుర్తుకు వచ్చింది. లగేజ్‌ను టెంపో దగ్గరికి తీసుకెళ్లాక అతను నా చేతిలో 2 రూపాయలు పెట్టి ఒక మాట కూడా అన్నాడు. ఆ రోజుల్లో నీకున్న గర్వం ఎవరికి లేదు, ఆ రోజులు గుర్తున్నాయా? అని అడిగాడు. ఆ మాటకు కన్నీళ్లాగలేదు. జీవితంలో చాలా బాధపడిన సందర్భం అది` అని రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు. ఇంట్లో మన:శాంతి, బయట రెస్పెక్ట్ లేకపోతే.. ఎంత డబ్బు, కీర్తి వచ్చినా వేస్టే అని రజనీకాంత్ ఇదే ఈవెంట్‌లో పేర్కొన్నారు.