``లిక్కర్ స్కాం.. ఏంటబ్బా.. అదేమీ లేదు. కేవలం చంద్రబాబు సృష్టి. అసలు ఆయన వచ్చాకే లిక్కర్ కుంభకోణం జరుగుతోంది. ఎక్కడికక్కడ బెల్టు షాపులు పెట్టారు. ప్రైవేటుకు ఇచ్చేశారు. వాళ్లకు వాళ్లే పంచేసుకుంటున్నారు. మా హయాంలో అంతా పారదర్శకంగా జరిగింది. ప్రభుత్వమే మద్యం అమ్మింది. ఇక, అవినీతి ఎక్కడిది?. ఇదంతా ట్రాష్.`` అని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తన హయాంలో జరి గిన మద్యం కుంభకోణాన్ని లైట్ తీసుకున్నారు.
ఇదేసమయంలో చంద్రబాబుపైనా ఆయన విమర్శలు చేస్తున్నారు. అయితే.. ఈ కేసులో 42 మందిని నిందితులుగా పేర్కొన్న దర్యాప్తు బృందం(సిట్) వీరి నుంచి సమాచారం సేకరించి.. ఇప్పటి వరకు 60 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. అంతేకాదు.. మరింత లోతుగా విచారణను ముమ్మరం చేసింది. ఎంపీ మిథున్‌రెడ్డి ప్రమేయం ఉందని కూడా అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే.. ఆయనను అరెస్టు చేసి జైలుకు తరలించారు.
ఇక, ఇప్పుడు తాజాగా 11 కోట్ల రూపాయలను హైదరాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో గుర్తించి స్వాధీనం చేసు కున్నారు. ఈ సొమ్ము వివరాలను ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు ఇచ్చిన సమాచారం మేరకే స్వాధీ నం చేసుకున్నారు. సో.. మొత్తానికి ఏదో జరిగిందన్నది స్పష్టమవుతూనే ఉంది. సిట్ అధికారులు చెప్పిన ట్టు.. 3500 కోట్ల పైచిలుకు మొత్తం కుంభకోణం జరిగినా.. ఏమీ లేదని.. అంతా మాయేనని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉంది.
ఇక, ఈ కేసు ఇప్పటితో కూడా పోయేలాలేదు. దుబాయ్ సహా.. స్విట్జర్లాండ్‌లో కొందరు నిందితులు వున్నా రని.. సిట్ అధికారులు ఇప్పటికే ఏసీబీ కోర్టుకు సమాచారం ఇచ్చారు. దుబాయ్, స్విట్జర్లాండ్‌లో ఉన్న వారిని భారత్కు రప్పించేలా.. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారంలో వారు కూడా ఏపీకి వస్తే.. అసలు కేసు మరిన్ని మలుపులు తిరగడం.. ఖాయంగా కనిపిస్తోంది. సో.. దీనిని బట్టి జగన్ చెబుతున్నట్టుగా.. ఏమీ లేదు. అనే మాట ఉత్తదే!.