సింగపూర్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. అక్కడి వ్యాపార వేత్తలతోనే కాదు.. విద్యావేత్తలు.. పరిశోధకులతోనూ చర్చలు జరుపుతున్నారు. తాజాగా మంగళవారం.. సింగపూర్‌లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్.. తెలుగు వాడైన మోహన్ తో సీఎం చంద్ర బాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఏఐ విశ్వ విద్యాల యం గురించి ఆయనకు వివరించారు.
ఒక్క యూనివర్సిటీనే కాకుండా.. ఏఐలో ఇన్నోవేషన్ కేంద్రాలను కూడా ఏపీలో ఏర్పాటు చేయనున్నట్టు చంద్రబాబు చెప్పారు. అమరావతిలో ఏఐ యూనివర్సిటీ.. విశాఖలో ఇన్నోవేషన్ కేంద్రాలు, క్వాంటమ్ వ్యాలీ సహా.. ఇతర సంస్థలను కూడా తీసుకువస్తున్నామన్నారు. వీటికి సహకారం అందించాలని మోహన్ ను కోరారు. అలాగే.. అధునాతన విద్యలకు ఏపీని కేంద్రంగా మార్చాలని కోరుకుంటున్నామని.. ఈ విషయంలోనూ సహకరించాలని సూచించారు.
యనివర్సిటీలు, పరిశోధన సంస్థలతో `ఏపీ సింగపూర్` సంస్థ భాగస్వామ్యం కావాలని సీఎం చంద్రబాబు కోరారు. ఏపీలో విద్యార్థులకు ఏఐ శిక్షణ, ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాములు, స్కిల్ డెవలప్‌మెంట్ మాడ్యూల్స్ లో తర్ఫీదు ఇవ్వాలని కోరారు. ఏఐ రాకతో ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్పులు వస్తున్నాయని.. ప్రధానంగా వైద్యం, వ్యవసాయం, విద్య, పౌర సేవల విషయంలో ఏఐ వినియోగం పెరిగిందన్నారు.
ఈ క్రమంలో ఏపీలోనే ఏఐ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇదిలావుంటే.. మంగళవా రం కూడా సీఎం చంద్రబాబుఫుల్ బిజీగా గడపనున్నారు. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూడా.. వేర్వే రు కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. కాగా.. గురువారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటన ముగియనుంది.