కేంద్ర మాజీ మంత్రి.. టీడీపీ సీనియర్ నాయకుడు(ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు).. విజయనగరం జిల్లాకు చెందిన పూసపాటి అశోక్ గజపతి రాజు శనివారం.. గోవా గవర్నర్‌గా పదవీ ప్రమాణం చేయనున్నా రు. ఈ రోజు రాత్రికే ఆయన గోవాకు చేరుకోనున్నారు. శనివారం ఉదయం 11.13 నిమిషాలకు.. గోవా గవర్న ర్‌గా ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే.. సాధారణంగా గవర్నర్‌తో ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉంది.
కానీ, గోవా అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం కావడంతో ఇక్కడ వ్యవహారాలను బాంబే హైకోర్టు చూస్తుంది. దీంతో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. పూసపాటి అశోక్ గజపతి రాజుతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు కావాల్సి ఉంది. అయితే.. ఆయన సింగపూర్ పర్యటనకు బయలు దేరి వెళ్తున్న నేపథ్యంలో ఆయనకు బదులుగా.. రాష్ట్ర టీడీపీ నాయకులు , కేంద్ర మంత్రి, టీడీపీ యువ నాయకుడు.. కింజరాపు రామ్మోహన్ నాయుడు హాజరు కానున్నారు.
అదేవిధంగా పలువురు టీడీపీ ఎంపీలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని.. సీఎం చంద్రబాబు ఓ జాబితాను పంపించారు. వారంతా కూడా అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. ఇదిలావుంటే.. గోవా గవర్నర్ బంగ్లాలో పూసపాటి అభిరుచులకు అనుగుణంగా.. సుమారు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరమ్మతులు, మౌలిక సదుపాయాలు కల్పించారు. అదేవిధంగా ప్రత్యేక కాన్యాయ్ కూడా గోవా నుంచి విజయనగరం చేరుకుంది.