అల్లుడితో కలిసి బాలీవుడ్ నటుడి భారీ ల్యాండ్ డీల్

News Image

వివిధ రంగాల్లో తమ సత్తా చాటే ప్రముఖులు.. సెలబ్రిటీలు.. తాము తోపులమనుకున్నరంగాలకే పరిమితం కాకుండా భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ తో పాటు.. వారి అభిరుచులకు తగిన వ్యాపారాల్లో అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబయి శివరులోన క్రికెటర్ అల్లుడైన బాలీవుడ్ సీనియర్ నటుడు ఒక భారీ ల్యాండ్ డీల్ పూర్తి చేయటం అందరిని ఆకర్షిస్తోంది.భారత క్రికెటర్ కేఎల్ రాహుల్.. బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి అల్లుడన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి థానేవెస్ట్ లో ఏడు ఎకరాల భూమిని కొనుగోలు చేసిన వైనం వెలుగు చూసింది. ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రముఖులు కొనుగోలు చేసిన ల్యాండ్ విలువ అధికారికంగా రూ.9.85 కోట్లుగా చెబుతున్నారు. మార్కెట్ విలువ అంతకు మించి ఉంటుందన్న మాట వినిపిస్తోంది.ఈ డీల్ గత నెల (మార్చి)లో జరిగినట్లుగా గుర్తించారు. ఈ భూమి ఆనంద్ నగర్.. కాసర్వాడవలి మధ్య ఉంది. థానే వెస్ట్ కు అనుకొని ఎక్స్ ప్రెస్ హైవేకు దగ్గరగా ఉండటంతో.. వ్యాపార కనెక్టివిటీకి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ల్యాండ్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఖర్చుల్లో భాగంగా రూ.68.96 లక్షలు.. రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.30వేలు ఖర్చు చేసినట్లుగా చెబుతున్నారు.వందకు పైగా బాలీవుడ్ సినిమాల్లో నటించిన సునీల్ శెట్టి సుపరిచితుడు.సినిమాలకే పరిమితం కాకుండా ఫిట్ నెస్.. రియల్ ఎస్టేట్.. హాస్పిటాలిటీ వెంచర్లలో పెట్టుబడులు పెట్టటం తెలిసిందే. ఇక.. కేఎల్ రాహుల్ విషయానికి వస్తే..భారత జట్టు తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ టీంలకు నాయకత్వం వహించినఅతను.. క్రికెట్ లో అత్యధిక పరుగులు సాధించిన భారత క్రికెటర్లలో ఒకరన్న సంగతి తెలిసిందే.

Recent Comments
Leave a Comment

Related News