టెక్సాస్ లో రోడ్డు యాక్సిడెంట్.. గుంటూరు విద్యార్థిని దుర్మరణం

News Image

స్నేహితురాలితో టెక్సాస్ రోడ్డు మీద నడుస్తుంటే కారు ఢీ.. గుంటూరు విద్యార్థిని దుర్మరణం
అయ్యో అనిపించే విషాదం ఒకటి చోటు చేసుకుంది. మరో నెలలో ఉన్నత విద్యను పూర్తి చేసి.. గ్రాడ్యుయేషన్ డేలో పట్టా అందుకోవాల్సిన గుంటూరు విద్యార్థిని ఒకరు టెక్సాస్ లో జరిగినరోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. తమ కుమార్తె త్వరలో గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంటుందన్న ఆనందంలో ఉన్న ఆ ఫ్యామిలీ ఇప్పుడు కోలుకోలేని శోకసంద్రంలో మునిగిపోయింది. అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన దీప్తి దుర్మరణం పాలయ్యారు.
గుంటూరు రాజేంద్రనగరర్కు చెందిన 23 ఏళ్ల దీప్తి టెక్సాస్ లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. మరోనెలలో కోర్సు పూర్తి కానుంది. ఈ నెల 12న స్నేహితురాలైన స్నిగ్ధతో కలిసి దీప్తి రోడ్డు మీద నడిచి వెళుతున్నారు. వేగంగా దూసుకొచ్చిన కారు ఒకటి వీరిని ఢీ కొంది. దీంతో.. దీప్తి తలకుతీవ్ర గాయం కాగా.. స్నిగ్ధకు కూడా గాయాలు అయ్యాయి.
ప్రమాదం గురించి దీప్తి స్నేహితురాళ్లు.. వారి కుటుంబానికి సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే ఆయన.. గుంటూరులోని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ క్యాంపుకార్యాలయాన్ని సంప్రదించారు. అమెరికాలో ఉన్న పెమ్మసాని వెంటనే స్పందించి.. మెరుగైన చికిత్స అందేలా ప్రయత్నించారు. గుంటూరులోని పెమ్మసాని స్నేహితులు క్రౌడ్ ఫండింగ్ ద్వారా 80 వేల డాలర్లు సేకరించారు. మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది.  ఈ నెల 15న దీప్తి కన్నుమూశారు. దీప్తి తండ్రి చిరు వ్యాపారి. తల్లి గ్రహిణి. చదువులో ముందుండే కుమార్తె.. ఉన్నత చదువులు పూర్తి చేస్తుందన్న ఆశతో ఉన్న ఆ కుటుంబానికి తాజా పరిణామం అశనిపాతంగా మారింది.

Recent Comments
Leave a Comment

Related News