రాజ‌ధాని రైతుల‌ను రెచ్చ‌గొట్టి.. వైసీపీ జ‌గ‌న్నాట‌కం!

News Image

ఒక‌ప్పుడు మూడు రాజ‌ధానుల పేరుతో న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిని అట‌కెక్కించే ప్ర‌య‌త్నం చేసిన వారు.. ఒక‌ప్పుడు రైతులను పోలీసు బూటు కాళ్ల‌తో త‌న్నించిన వారు.. ఇప్పుడు అదే రైతుల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని రోడ్డెక్కితే..?  అదే రైతులకు తాము అన్ని విధాలా అండ‌గా ఉంటామ‌ని, వారి ప్ర‌యోజ‌నా లు కాపాడ‌తామ‌ని చెబితే..?  ఎలా ఉంటుంది?  ఇదో పెద్ద జ‌గ‌న్నాటం! అన్న విష‌యం ఇట్టే అర్ధ‌మవుతుం ది. కానీ.. అమాయ‌కులైన రైతులు.. ఇప్పుడు ఆ విష‌పు ప్ర‌చారంలో చిక్కుకుంటున్నారా? అంటే.. ఔన‌నే అంటోంది ప్ర‌భుత్వం.

రైతుల నుంచి సేక‌రించిన భూమికి సంబంధించి ప్ర‌భుత్వం చాలానే చేయాలి. దీని విష‌యంలో ఎలాంటి సందేహాలు ఎవ‌రికీ లేవు. కానీ.. ఇదేస‌మ‌యంలో గ‌త ఐదేళ్లు జ‌రిగిన విధ్వంసం కార‌ణంగా జ‌రిగిన న‌ష్టాన్ని కూడా ప్ర‌భుత్వం స‌రిచేస్తేనే.. పెట్ట‌బడులు వ‌స్తాయి. ప్ర‌భుత్వానికి చేయి తిరుగుతుంది. ఈ నేప‌థ్యంలోనే కొంత జాప్యం జ‌రుగుతోంది. అయితే.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాన్ని ఒంట‌బ‌ట్టించుకున్న వైసీపీ.. రైతుల‌ను ఇదే సాకుతో రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్న విమ‌ర్శ‌లు మంత్రుల నుంచి నాయ‌కుల వ‌ర‌కు వినిపిస్తున్నాయి.

అస‌లు వాస్త‌వానికి గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూట‌మి గెలిచింది కాబ‌ట్టి.. అమ‌రావ‌తి నిలిచింది. రైతు లు తమ ప్ర‌యోజ‌నాల గురించి.. త‌మ‌కు జ‌ర‌గాల్సిన ల‌బ్ధి గురించి మాట్లాడుతున్నారు. అదే మ‌రోసారి పొర‌పాటున వైసీపీ విజ‌యం ద‌క్కించుకుని ఉంటే.. వారి గోడు ఎవ‌రు ప‌ట్టించుకునే వారు. అప్పుడు నిం డా మునిగేవారు క‌దా! ఈ విష‌యాన్ని వైసీపీ హ‌యాంలో జ‌ర‌గిన లాఠీచార్జీల‌ను రైతులు మ‌రిచిపోయిన‌ట్టు గా వ్య‌వ‌హ‌రిస్తూ.. వైసీపీ వ‌ల‌లో చిక్కుకుని జ‌గ‌న్నాటకంలో తాము ప్ర‌దాన పాత్ర‌ధారులు అవుతున్నారని ప్ర‌భుత్వం ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది.

జ‌గ‌న్నాట‌క‌ విష ప‌రిష్వంగంలో చిక్కుకునే ముందు.. రైతులు ఇన్నాళ్లు ఆగారు కాబ‌ట్టి.. మ‌రికొన్నాళ్లు ఓపిక‌గా.. స్థ‌యిర్యంతో ప్ర‌భుత్వానికి స‌హ‌క‌రిస్తే.. మున్ముందు.. రాజ‌ధాని అమ‌రావ‌తి పూర్తి కావ‌డం.. రైతులకు మేళ్లు జ‌ర‌గ‌డం రెండు ఉంటాయ‌న్న‌ది స‌ర్కారు వారి మాట‌. మ‌రి ఈ విష‌యంలో అన్న‌దాతలు ఆవేశాల‌కు పోకుండా.. ఆలోచ‌నాత్మ‌క దృక్ఫ‌థంతో వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది.

Recent Comments
Leave a Comment

Related News