వైసీపీ అధినేత జగన్ చేసిన తప్పులు ఆయన సతీమణి భారతికి చుట్టుకుంటున్నాయా? ఆమె పాత్ర ఉన్నా లేకున్నా.. ఆమె ఇరకాటంలో పడి.. ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోందా? అవమానాలకు.. సైతం గురి కావాల్సి వస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ నాయకులు. గత రెండు రోజుల కిందట జరిగిన ఘటన కావొచ్చు.. ఇంతకు ముందు జరిగిన వివేకానందరెడ్డి హత్య కావొచ్చు.. వీటికి మధ్యలో తెరమీదికి వచ్చిన ఆస్తుల పంపకాలకు సంబంధించిన విషయం కావొచ్చు.
ఏదైనా.. కూడా.. భారతి సెంటరాఫ్‌ది టాపిక్ అయ్యారు. ముఖ్యంగా ఆస్తుల విషయంలో నేరుగా కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల.. తన వదిన అనికూడా చూడకుండా.. భారతి పై తీవ్ర విమర్శలు చేశారు. ఇక, విజయమ్మ కూడా.. ఇలానే స్పందించారు. పార్టీ నుంచి తనను బయటకు పంపించడానికి ఇంట్లో వాళ్లే కారణమం టూ.. షర్మిల ఆనాడు భారతిని కార్నర్ చేశారు. అంతేకాదు.. కొంగుకు కట్టేసుకున్నారంటూ.. తన అన్న విషయాన్ని భారతికి ముడిపెట్టి విమర్శలు చేశారు.
అయినప్పటికీ.. ఏనాడూ భారతిమీడియా ముందుకు రాలేదు. సంస్థలను చేజిక్కించుకున్నారని.. ఉమ్మ డి ఆస్తులను అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించినప్పుడు కూడా.. పన్నెత్తు మాట అనలేదు. ఇక, సోషల్ మీడియాలో ఇప్పుడు తెరమీదికి వచ్చిన కిరణ్ వ్యవహారానికి ముందు.. కూడాఅనేక సందర్భాల్లో భారతి ట్రోల్స్‌కు గురయ్యారు. తీవ్రంగా అవమానించారు. అప్పుడు కూడా.. ఆమె నోరు విప్పలేదు. చాలా మౌనంగా ఉండి.. తన పని తాను చేసుకుపోయారు.
తాజాగా కిరణ్ చేసిన వ్యాఖ్యలు.. అత్యంత నీచానికి ఒడిగట్టిన తీరు.. నిజంగానే భారతిని కుమిలిపోయేలా చేశాయి. దీంతో ఆమె తాడేపల్లి నుంచి బెంగళూరుకువెళ్లిపోయినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కుటుంబంలోనూ.. ఈ వివాదం పెను రచ్చకు దారితీసిందని.. జగన్‌ను భారతి నిలదీసినట్టు కూడా.. పార్టీలో చర్చ నడుస్తోంది. వైసీపీ చేసిన తప్పుల కారణంగానే.. నేను ఇప్పుడు అవమానాలకు గురవుతున్నాననిఆమె ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఏదేమైనా.. జగన్ చేసిన తప్పులు భార్యకు చుట్టుకోవడంపై వైసీపీ వర్గాల్లో చర్చ నడుస్తుండడం గమనార్హం.