నేను లేకుంటే ట్రంప్ ఓడేవారు.. మస్క్ సంచలనం

admin
Published by Admin — January 01, 2025 in Politics
News Image

ప్రపంచ కుబేరుడు.. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికాకు అధ్యక్షుడైన నేతను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తెంపరితనంతో మాట్లాడే ట్రంప్ కు సరైనోడు ఇతడే అన్నట్లుగా మస్క్ వ్యాఖ్యలు ఉండటం విశేషం. 2024లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్.. రిపబ్లిక్ పార్టీ నేతలు ఓటమిపాలు కాకుండా తాను అండగా ఉన్నట్లుగా మస్క్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

‘నేను లేకుంటే ట్రంప్ ఓడిపోయేవారు. ప్రతినిధుల సభపై డెమోక్రాట్లు అధిక్యం సాధించేవారు. సెనెల్ లో రిపబ్లికన్లు 51-49తో ఉండేవారు. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మస్క్ ను వ్యతిరేకించటంతో తాను అసంతృప్తికి గురైనట్లుగా ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోమస్క్ ఈ వ్యాఖ్యలు చేయటం విశేషం. ‘నా స్నేహితుడు వైట్ హౌస్ లో లేకపోవటం విచారం. నేను ఎన్నికల్లో విజయం సాధించటానికి మస్క్ అవసరం లేదు. అతడు లేకుండానే పెన్సిల్వేనియాలో నేను గెలిచేవాడిని’’ అని పేర్కొన్నారు.

అంతేకాదు.. మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు.. రాయితీలకు కోత వేస్తానంటూ హెచ్చరిక జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో మస్క్ తన ఎక్స్ లో స్పందిస్తూ.. తాను లేకుంటే ట్రంప్ ఎన్నికల్లో ఓడేవారన్న వ్యాఖ్య చేయటంతో.. ఈ ఇద్దరి మిత్రుల మధ్య మాటల యుద్ధం ఎక్కడి వరకు వెళుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇలాంటి వేళలోనే.. మస్క్ తన అభిమానులను ఉద్దేశించిఆసక్తికర ప్రశ్నను సంధించారు.

 

కొత్త పార్టీ పెట్టొచ్చా? అన్న మస్క్ ప్రశ్నకు పలువురు సానుకూలంగా స్పందించారు. 80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలా అమెరికాలో కొత్త పార్టీ పెట్టటానికి ఇదే సరైన సమయమా? అని అడగ్గా.. మస్క్ కు అనుకూలంగా పలువురు స్పందించటం గమనార్హం.

మరోవైపు ఈ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచిన ఫెడరల్ ప్రభుత్వ వ్యయ నియంత్రణ బిల్లు అంశంపైనా ట్రంప్ స్పందించారు. తాము ప్రతిపాదించిన ప్రభుత్వ వ్యయ నియంత్రణ బిల్లును మస్క్ వ్యతిరేకించటాన్ని తప్పుపట్టిన ట్రంప్.. ‘బిల్లులోని ముఖ్యాంశాల్ని తెలిసి కూడా మస్క్ వ్యతిరేకించారు. దీంతో నిరాశకు గురయ్యా’ అని వ్యాఖ్యానించారు.  ప్రభుత్వ వ్యయ నియంత్రణకు ఉద్దేశించిన డోజ్ కు మస్క్ అధిపతిగా ఉండటం.. వ్యయ నియంత్రణ బిల్లును చూసిన తర్వాత తన పదవికి రాజీనామా చేసినట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే.. ఒక్క విద్యుత్తు వాహనాల అంశం తప్పించి బిల్లులోని మిగిలిన అంశాలపై మస్క్ కు అభ్యంతరాలు లేవని ట్రంప్ పేర్కొనగా.. అందుకు భిన్నంగా ప్రపంచ కుబేరుడు స్పందించారు. వ్యయ నియంత్రణ బిల్లును తనకు చూపలేదని పేర్కొన్నారు. మరోవైపు మస్క్ తో తనకు ఎంతో గొప్ప స్నేహం ఉందని.. మస్క్ ను తాను ఎంతో చేసినట్లుగా ట్రంప్ చెప్పుకోవటం గమనార్హం. ‘అతనితో స్నేహం కొనసాగుతుందో లేదో చెప్పలేను.

అతను నా గురించి ఎంతో గొప్పగా చెప్పారు. చెడుగా ఒక్క మాట అనలేదు. అయినా ఆయనతో నేను అసంతృప్తికి గురయ్యా’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మొత్తానికి ఇద్దరు పవర్ ఫుల్ వ్యక్తుల మధ్య మిత్రభేదం రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

Tags
usa president trump elon musk Trump's victory reason behind trump's victory
Recent Comments
Leave a Comment

Related News